Begin typing your search above and press return to search.

బర్త్ డే హంగామా షురూ చేసిన RAPO...!

By:  Tupaki Desk   |   15 May 2020 6:30 AM GMT
బర్త్ డే హంగామా షురూ చేసిన RAPO...!
X
రామ్ పోతినేని.. 'దేవదాస్' సినిమాతో సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాడు యంగ్ హీరో. ఫస్ట్ సినిమాతోనే ఎనర్జిటిక్ హీరో అనిపించుకున్నాడు. అప్పటి నుండి వరుస సినిమాలతో దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. 'రెడీ' 'మస్కా' 'కందిరీగ' 'పండగ చేస్కో' 'నేను శైలజ' సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. గతేడాది వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తో మంచి జోష్ మీదున్నాడు రామ్. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు రామ్ కెరీర్లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన రామ్ పోతినేని వెంటనే క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాను పట్టాలెక్కించాడు. కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఏప్రిల్‌ లో రిలీజ్ కావలసిన ఈ చిత్రం లాక్‌ డౌన్ కారణంగా వాయిదా పడింది. వరుసగా చాక్లెట్ బాయ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న రామ్ ఈ రెండు సినిమాలతో అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ లో కనిపించాడు.

ఇప్పటికే 'రెడ్' టీజర్ విడుదల కాగా ఈ రోజు రామ్ బర్త్ డే సందర్భంగా లేటెస్టుగా ఈ సినిమాలో 'డించక్' మాస్ సాంగ్ టీజర్ విడుదల చేసారు. ఈ సాంగ్ లో హెబ్బా పటేల్ తో కలిసి రాపో మాస్ స్టెప్ర్స్ తో అదరగొట్టాడు. ఈ సాంగ్ థియేటర్స్ లో ఖచ్చితంగా బ్లాస్ట్ అవడం ఖాయమంటూ రామ్ ట్విట్టర్ వేదికగా సాంగ్ టీజర్ రిలీజ్ చేసాడు. ఓటీటీలో కాకుండా థియేటర్స్ లోనే వస్తామంటూ మరోసారి గుర్తు చేసాడు రామ్. ఈ సాంగ్ ఇస్మార్ట్ లో దిమాక్ ఖరాబ్ రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. సంగీత బ్రహ్మ మణిశర్మ ఇచ్చిన మాస్ బీట్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు. మొత్తం మీద రామ్ ఏదో మ్యాజిక్ కోసం ట్రై చేస్తున్న‌ట్లున్నాడు అనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఇస్మార్ట్ రామ్.. 'రెడ్' తో మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్ ని కూడా లైన్ లో పెట్ట‌బోతున్నాడ‌ని అత‌డి స‌న్నిహిత వ‌ర్గాలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.

సొంత బ్యాన‌ర్ స్రవంతి మూవీస్ బ్యానర్ లో చేసిన సినిమా కాబ‌ట్టి ఈ సినిమా విష‌యంలో కొంచెం ఎక్కువగా క‌ష్ట‌ప‌డిన‌ట్లున్నాడు. ఇప్పటికే విడుదలైన 'రెడ్' టీజర్ మరియు సాంగ్ టీజర్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో ఓ 70 కోట్ల గ్రాస్ కి రామ్ టార్గెట్ చేస్తున్న‌ట్లు సమాచారం. తమిళ మూవీ 'తడమ్' స్టోరీ లైన్ ఆధారంగా రూపొందిందిన 'రెడ్' సినిమా టైటిల్ మాదిరిగానే కథ, కథనం కూడా చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తర్వాత రామ్ నుండి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. 'రెడ్' సినిమాతో తన సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయాలని.. ముందు రోజుల్లో మరెన్నో సక్సెస్ లను అందుకోవాలని కోరుకుంటూ రామ్ పోతినేని (RAPO) కి తుపాకీ బర్త్ డే విషెస్ తెలియజేస్తోంది.