Begin typing your search above and press return to search.

'బాబు బొమ్మకి పెళ్ళంట' అసలు టీవీ ప్రోగ్రాం ఎందుకని..??

By:  Tupaki Desk   |   14 Aug 2020 12:30 PM GMT
బాబు బొమ్మకి పెళ్ళంట అసలు టీవీ ప్రోగ్రాం ఎందుకని..??
X
ఈరోజుల్లో హీరోయిన్లు, నటులు వారి వయసు 30 దాటినా పెళ్లి విషయంలో నోరు మెదపటం లేదు. ఇప్పటికి వారి గ్లామర్ షో తో అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా మెగా ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక తన 26 యేళ్ళ వయసుకే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి జరగనుంది. ఇటీవలే నాగబాబు ఈ విషయాన్ని అఫీషియల్‌‌గా ప్రకటించడంతో నెట్టింట నిహారిక పెళ్లికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేగాక ఇదివరకే నిహారిక తనకు కాబోయే భర్తతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి హంగామా చేసింది. ఈ నేపథ్యంలో జనాలలో నిహారిక పెళ్లి పై ఉన్న క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ నాగబాబు.. జీ ఛానెల్ యాజమాన్యంతో కలిసి ఓ కొత్త కార్యక్రమం రూపొందించడానికి ప్లాన్ చేశారు.

'బాపు బొమ్మకి పెళ్ళంట' అనే పేరుతో బుల్లితెర ప్రేక్షకులకు నిహారిక పెళ్లి వేడుకను ముందే చూపించే ప్లాన్ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నారట. తాజాగా ఈ షో ప్రోమో వీడియో విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు. కానీ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతుందని టాక్. ఈ వీడియోలో నిహారిక పెళ్లి కూతురు గెటప్‌లో కనిపించగా.. యాంకర్ అనసూయ తల్లి గెటప్ లో నిహారికకు పెళ్లి బట్టలు పెట్టిన సీన్స్ ప్రోమోలో కనిపిస్తాయి. అంతా బాగానే ఉంది కానీ నిహారిక పెళ్లి గురించి టీవీలో ప్రోగ్రాం క్రియేట్ చేయడం ఏంటి అసలు.. ఏ మాత్రం ప్రేక్షకులలో ఆసక్తి మాత్రం కనిపించడం లేదు. ఇది పర్సనల్ నిర్ణయమో లేక ఎలా భావించారో కానీ పెళ్ళికి ముందే ఇలా ప్రోగ్రాం చేయడం పట్ల సినీ అభిమానులు, టీవీ ప్రేక్షకులు ఏ మాత్రం ఇంటరెస్ట్ చూపించడం లేదని సమాచారం. నిహారిక పెళ్లి గురించి ఇంటరెస్ట్ రావడానికి ఆమె ఓ స్టార్ హీరోయిన్ కాలేదు.. అలాగని ఏ విధంగాను ప్రేక్షకులను చేరలేదు. అలాంటప్పుడు ఈ ప్రోగ్రాంతో బోర్ కొట్టించడం ఎందుకని సినీవర్గాలలో వినికిడి.