Begin typing your search above and press return to search.
ఆ స్టార్ హీరోయిన్ ఈ సింగర్ కు చాలా లక్కీ అంట!
By: Tupaki Desk | 19 Feb 2021 7:00 AM ISTటాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్లల ఒకరు పూజాహెగ్డే. గతకొన్నేళ్లుగా పూజ నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ హిట్లుగా నిలిచాయి. అందుకే చాలామంది హీరోలు పూజను లక్కీ మస్కట్ గా భావిస్తున్నారట. కానీ తాజాగా ఓ సింగర్ కూడా పూజా హెగ్డేను తన లక్కీ మస్కట్ అని అంటున్నాడట. ఆ సింగర్ ఎవరో కాదు అర్మాన్ మాలిక్. తెలుగులో బుట్టబొమ్మ పాటతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు అర్మాన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను పాడిన మూడు పాపులర్ తెలుగు సాంగ్స్.. అనగనగనగా (అరవింద సమేత), బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో), అలాగే గుచ్చేగులాబి (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్).. ఈ మూడు పాటలలో పూజాహెగ్డేనే హీరోయిన్ కావడం విశేషం. అందుకే పూజను తను అదృష్టచిహ్నంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
అయితే దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి పనిచేయాలన్నది తన కల అని అర్మాన్ మాలిక్ అన్నాడు. అంతేగాక తన రెండో కోరికను కూడా బయటపెట్టాడు అర్మాన్. విదేశీ భాషలు అరబిక్, స్పానిష్ లాంటి ఇతర భాషలలో పాడాలని కోరుకుంటున్నట్లు అర్మాన్ తెలిపాడు. ఇటీవలే అర్మాన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం కోసం ‘గుచ్చే గులాబీ’ పాటను పాడటం జరిగింది. అలా వరుసగా తెలుగులో పాటలు పాడుతూ పాపులర్ అవుతున్నాడు కాబట్టి ఈ సింగర్ తెలుగు భాషను నేర్చుకోవాలని ఆశిస్తున్నాడట. ప్రస్తుతం అర్మాన్ చేతిలో తెలుగు సాంగ్స్ ఆఫర్స్ చాలానే ఉన్నాయట. ఈ ఏడాది అర్మాన్ నుండి మరిన్ని తెలుగు సాంగ్స్ రాబోతున్నాయని సమాచారం. చూడాలి మరి అర్మాన్ లక్కీమస్కట్ కాంబినేషన్ మళ్లీ సెట్ అవుతుందేమో!