Begin typing your search above and press return to search.

అక్కినేని అభిమానుల‌కు షాకిచ్చే ట్రీట్

By:  Tupaki Desk   |   16 Dec 2019 4:01 AM GMT
అక్కినేని అభిమానుల‌కు షాకిచ్చే ట్రీట్
X
పెళ్లి త‌రువాత సినిమాల ఎంపిక‌లో అక్కినేని కోడ‌లు స‌మంత ఆలోచ‌నా ధోర‌ణి మారింది. `రంగ‌స్థ‌లం` నుంచి ఆమె బ్రిలియంట్ స్క్రిప్ట్ ల‌ను ఎంచుకుంటున్నారు. ఎంపిక‌ల ప‌రంగా త‌నదైన‌ అభిరుచిని తెలియ‌జేస్తున్నారు. ఇటీవ‌ల‌ స‌మంత న‌టించిన చిత్రాల వ‌రుస చూస్తే ఈ విష‌యం స్ఫ‌ష్ట‌మవుతోంది. ప్ర‌స్తుతం త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `96` రీమేక్ లో న‌టిస్తున్న స‌మంత తాజాగా మ‌రో కొత్త అడుగు వేసింది.

హిందీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన `ఫ్యామిలీ మ్యాన్‌` వెబ్ సిరీస్ లో స‌మంత న‌టిస్తున్నార‌న్న‌ది ప్ర‌స్తుతం హాట్ టాపిక్. క‌శ్మీర్ టెర్ర‌రిజ‌మ్ నేప‌థ్యంలో రాజ్ అండ్ డీకే రూపోందించిన ఈ సిరీస్ లోని 10 ఎపిసోడ్స్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయ‌డ‌మే కాకుండా మేకింగ్ ప‌రంగా ప్ర‌శంస‌ల్ని అందుకుంది. దీంతో రెండ‌వ సీజ‌న్ పై క్రేజ్ ఏర్ప‌డింది. తాజా సీజ‌న్ కోసం మేక‌ర్స్ స‌మంత‌ని రంగంలోకి దింపారు. ఈ సిరీస్‌తో అక్కినేని అభిమానుల‌కు బిగ్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతోంద‌ని ఇన్ సైడ్ టాక్.

`ఫ్యామిలీమ్యాన్ 2` సిరీస్‌లో స‌మంత నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలిసింది. సామ్ కి న‌టించేందుకు బిగ్ స్కోప్ ఉంద‌ట‌. ఇటీవ‌లే త‌మిళ చిత్రం `సూప‌ర్ డీలక్స్‌` లో నెగెటివ్ ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టించిన సామ్ `ఫ్యామిలీమ్యాన్‌-2`లో మాత్రం పూర్తి నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు స‌మంత‌ను క‌థానాయిక‌గా గ్లామ‌ర్ యాంగిల్ లోనే చూసిన ప్రేక్ష‌కులు `ఫ్యామిలీమ్యాన్ 2`లో మరో యాంగిల్ లో చూడ‌బోతున్నారు. ముఖ్యంగా అక్కినేని అభిమానుల‌కు ఇది బిగ్ స‌ర్ ప్రైజ్ గా ఉండ‌నుంది. స‌మంత త‌న పాత్ర‌కు ఏమేర‌కు న్యాయం చేయ‌నున్నారు? ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేస్తారా లేదా అన్న‌ది తెలియాలంటే `ఫ్యామిలీమ్యాన్ 2` సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే వ‌ర‌కూ వేచి చూడాల్సిందే. తొలి ప‌ది ఎపిసోడ్స్ లోని గ్రిప్ సెకండ్ సీజ‌న్ లో కంటిన్యూ చేయ‌గ‌ల‌గితే చాలు ఈ సిరీస్ పెద్ద స‌క్సెస‌యిన‌ట్టేన‌ని అభిమానులు భావిస్తున్నారు.