Begin typing your search above and press return to search.

ఒక్కరు ముద్దు ఆపై వద్దు అంటున్న ప్రభాస్‌20 టీమ్‌...?

By:  Tupaki Desk   |   25 Jun 2020 12:30 AM GMT
ఒక్కరు ముద్దు ఆపై వద్దు అంటున్న ప్రభాస్‌20 టీమ్‌...?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో సినిమా స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. అయినా ఇంతవరకు ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కూడా రివీల్ చేయకపోవడంతో ప్రభాస్ అభిమానుల్లో అసహనం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ లవ్ డ్రామాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. అయితే బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై అమిత్ త్రివేది స్పందిస్తూ ఈ చిత్రానికి సంగీతం అందించడం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ మూవీకి సంగీతం ఎవరు అందించబోతున్నారు.. 'సాహో'లాగే ఈ సినిమాకు కూడా అవుతుందా.. అని ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో 'సాహా' సినిమాకి పలువురు సంగీత దర్శకులు వర్క్ చేసినట్లే ఈ సినిమాకి కూడా వర్క్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇవన్నీ పుకార్లే అని.. ప్రభాస్‌20 టీమ్‌ సంగీత దర్శకుడిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్‌ ని ఈ సినిమా కోసం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ కోసం ప్రభాకరన్ రెండు పాటలను కూడా పూర్తి చేశాడట. ప్రభాస్ మూవీ టైటిల్‌ గానీ ఫస్ట్‌ లుక్‌ గానీ విడుదలచేసే సమయంలో జస్టిన్ ప్రభాకరన్‌ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కాగా ప్రభాకరన్ తెలుగులో విజయ్‌ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ పాటలు మాత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ టీమ్ అతడిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 'సాహో' సినిమాకి చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేయడం వలన జరిగిన డామేజ్ ని దృష్టిలో పెట్టుకొని.. మళ్ళీ ఆ మిస్టేక్ ని రిపీట్ చేయకూడదని భావించిన మేకర్స్ సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ కే ఫిక్స్ అయిపోయారట. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఓ డియర్' 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.