Begin typing your search above and press return to search.

మన సౌత్‌ ఇండియన్ మూవీకి అరుదైన గౌరవం

By:  Tupaki Desk   |   8 Jan 2023 2:30 AM GMT
మన సౌత్‌ ఇండియన్ మూవీకి అరుదైన గౌరవం
X
సౌత్ ఇండియన్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఇప్పటికే ఆర్‌ఆర్ఆర్‌ సినిమా ఆస్కార్‌ నామినేషన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షార్ట్‌ లిస్ట్ లో ఆర్‌ ఆర్ ఆర్ సినిమా యొక్క పేరును కూడా చేర్చడం జరిగింది. ఇప్పుడు మరో సౌత్‌ ఇండియన్ మూవీకి అరుదైన గౌరవం దక్కింది.

తమిళ స్టార్‌ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం పొన్నియిన్ సెల్వన్‌ 1 చిత్రం ఏ స్థాయిలో వసూళ్లు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేసి ఇండస్ట్రీ హిట్‌ గా కూడా పొన్నియిన్‌ సెల్వన్ నిలిచిన విషయం తెల్సిందే.

ఇప్పుడు పొన్నియిన్‌ సెల్వన్‌ 16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఏకంగా ఆరు నామినేషన్లు పొందడం జరిగింది. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఉత్తమ చిత్రం.. ఉత్తమ ఒరిజినల్ సంగీతం.. ఉత్తమ ఎడిటింగ్.. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్.. ఉత్తమ ఛాయాగ్రహణం మరియు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో నామినేషన్స్ ను దక్కించుకుంది.

భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా ఈ ఆరు విభాగాల్లో కనీసం రెండు మూడు అవార్డులు అయినా దక్కుతాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా యొక్క సీక్వెల్‌ పొన్నియిన్ సెల్వన్‌ పార్ట్‌ 2 ను ఈ ఏడాది ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే మణిరత్నం ప్రకటించాడు.

మొదటి పార్ట్‌ తో పోల్చితే రెండవ పార్ట్‌ అంతకు మించి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ యూనిట్‌ సభ్యులు ధీమాతో ఉన్నారు. విక్రమ్‌.. ఐశ్వర్యరాయ్‌.. కార్తీ.. జయం రవి.. త్రిష ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఈ సినిమా లో నటించారు. పాన్ ఇండియా రేంజ్‌ లో పొన్నియన్ సెల్వన్ 2 కూడా ఆకట్టుకోవడం ఖాయం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.