Begin typing your search above and press return to search.

అమితాబచ్చన్ కి అరుదైన గౌరవం

By:  Tupaki Desk   |   20 Jan 2023 6:41 AM GMT
అమితాబచ్చన్ కి అరుదైన గౌరవం
X
ఇండియన్ మూవీ లెజెండ్, బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ స్థాయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా అంటే ప్రపంచంలో ఎక్కడైనా ముందుగా వినిపించే పేరు అమితాబచ్చన్. ఇదిలా ఉంటే ఇప్పుడు అమితాబచ్చన్ కి అరుదైన గౌరవం సౌదీలో లభించింది.ఫుట్ బాల్ లెజెండ్స్ మెస్సి, రోనాల్డో, నెయిమర్ వంటి స్టార్స్ అందరూ కలిసి ఆడుగుతున్న ఫ్రెండ్లీ మ్యాచ్ లోప్రారంభించే అవకాశం లభించింది.

రియాద్ లో జరగనున్న మ్యాచ్ ని గెస్ట్ గా వెళ్లి ఆటగాళ్ళు అందరికి కరచాలనం చేసి గేమ్ ని స్టార్ట్ చేశారు. దీనికి సంబందించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోని కేవలం 4 గంటల్లో 22 లక్షలకి పైగా నెటిజన్లు వీక్షించడం విశేషం.

దీనిని బట్టి అమితాబచ్చన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ వీడియోని షేర్ చేయడంతో పాటు ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాళ్ళతో కలిసి మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని అమితాబచ్చన్ తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఇదిలా ఉంటే అమితాబచ్చన్ వారందరికీ కలిసి దిగిన ఫోటోని కూడా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఇక అమితాబచ్చన్ షేర్ చేసిన వీడియోపై విరాట్ కోహ్లితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీ ప్రముఖులు కూడా రెస్పాండ్ కావడం విశేషం.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రాజెక్ట్ కె సినిమాలో అమితాబచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పరశురామ్ పాత్రలో అమితాబ్ నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే హిందీలో మరో ఐదు ప్రాజెక్ట్స్ కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కావడం విశేషం.

మరో వైపు సౌత్ లో కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కోసం కూడా అమితాబచ్చన్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తానికి ఈ ఏజ్ లో కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఉండటం అమితాబచ్చన్ రేంజ్ లో పరిచయం చేస్తుందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.