Begin typing your search above and press return to search.

'న‌వాబ్‌' కోసం రెహ‌మాన్ లైవ్‌

By:  Tupaki Desk   |   2 Sep 2018 5:12 AM GMT
న‌వాబ్‌ కోసం రెహ‌మాన్ లైవ్‌
X
ఏ.ఆర్‌.రెహ‌మాన్ అంటేనే సంగీతానికి చిరునామా. ఇళ‌య‌రాజా త‌ర్వాత శూన్యం నుంచి సంగీత ధ్వ‌నులు క్రియేట్ చేసిన ఏకైక‌ స్వ‌ర‌మాంత్రికుడిగా ఆయ‌న‌కు మాత్ర‌మే క్రెడిట్ ద‌క్కుతుంది. ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా కొంద‌రు సంగీత ద‌ర్శ‌కులు అదే బాటను అనుస‌రించ‌డం త‌ప్ప వాళ్ల కంటూ ప్ర‌త్యేక దారిని అనుస‌రించిన‌ట్టు క‌నిపించ‌ద‌ని క్రిటిక్స్ విశ్లేషిస్తారు. ఒక జ‌న‌రేష‌న్‌లో.. రాజ్ కోటి - ఎం.ఎం.కీర‌వాణి - హ్యారిస్ జైరాజ్‌ - యువ‌న్ శంక‌ర్ రాజా (ఇల‌య‌రాజా వార‌సుడు) - సందీప్ చౌతా వంటి సంగీత ద‌ర్శ‌కుల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కింది. అయితే రెహ‌మానియా ముందు ఎవ‌రూ నిల‌వ‌లేదు. అదే ది గ్రేట్ రెహ‌మాన్ ప్ర‌త్యేక‌త‌.

రెహ‌మాన్ తాను పోసిన మూస‌లోకి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రావాల‌ని భావిస్తారు. త‌న సౌక‌ర్యం మేర‌కు మాత్ర‌మే క‌మిట్‌ మెంట్ ఉంటుంది. మంచి స్వ‌రం కుదిరే వ‌ర‌కూ బాణీని ఓకే చెప్ప‌రు. అందుకే అత‌డి కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎంతో ఓపిగ్గా ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆ ఓపిక క‌మిట్‌ మెంట్ అతికొద్దిమందికే సాధ్యం. అలాంటి వారిలో లెజెండ్ మ‌ణిర‌త్నం ఒక‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న తెర‌కెక్కిస్తున్న `న‌వాబ్‌` (చెక్కా చివంత వార‌ణం) చిత్రానికి ఏ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 5న చెన్న‌య్‌ లో ఆడియో వేడుక నిర్వహిస్తున్నారు. ఈ ఆడియోలో న‌వాబ్ సినిమాలోని అన్ని పాట‌ల్ని లైవ్ ఆర్కెస్ట్రాలో రెహ‌మాన్ వినిపించ‌నున్నార‌ట‌.

రెహ‌మాన్ అంత టైమ్ కేటాయించి లైవ్‌ లోకి వ‌స్తున్నారంటే అది ఒక గొప్ప సినిమా అయితేనే! మ‌ణిర‌త్నం లాంటి ఉద్ధండుడు అయితేనే. ఇద్ద‌రు (ఇరువార్‌) నుంచి ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సాన్నిహిత్యం అలాంటిది. బొంబాయి సినిమాతో సంగీతాన్ని పీక్స్ కి తీసుకెళ్లారు. ఇప్పుడు న‌వాబ్ సంగీతంపైనా అంతే భారీ అంచ‌నాలున్నాయి. న‌వాబ్ త‌మిళ వెర్ష‌న్ పాట‌ల్ని ఒకేసారి లైవ్‌ లో రిలీజ్ చేస్తున్నారు. అర‌వింద‌స్వామి - శింబు - ప్ర‌కాష్‌ రాజ్‌ - అరుణ్ విజ‌య్‌ - జ్యోతిక వంటి స్టార్లు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.