Begin typing your search above and press return to search.

ఈసారి 'హెల్ బౌండ్' తో ప్రపంచాన్ని కుదిపేయబోతున్నారు

By:  Tupaki Desk   |   17 Nov 2021 8:00 AM IST
ఈసారి హెల్ బౌండ్ తో ప్రపంచాన్ని కుదిపేయబోతున్నారు
X
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వెబ్‌ సిరీస్ ల జోరు కొనసాగుతోంది. ప్రతి ఒక్క ఓటీటీ కూడా వెబ్ సిరీస్ లను తీసుకు వచ్చేందుకు భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఒకప్పుడు హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాలంటే ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉండేది. ముఖ్యంగా బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉండేది. కాని ఇప్పుడు వెబ్ సిరీస్ లకు ఆ క్రేజ్ ఉంటుంది. వెబ్‌ సిరీస్‌ లతో ప్రపంచ వ్యాప్తంగా నెట్‌ ఫ్లిక్స్ దుమ్ము రేపుతోంది. నెట్‌ ప్లిక్స్‌ కు పోటీగా అమెజాన్ కూడా భారీ బడ్జెట్‌ తో వెబ్‌ సిరీస్ లను తీసుకు వస్తుంది. ఈ మద్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ వీక్షకులు స్క్విడ్‌ గేమ్ మరియు మనీ హెయిస్ట్‌ తో ఊగి పోతున్నారు. ఈ వెబ్ సిరీస్ ల కొత్త సీజన్ ల కోసం కోట్లాది మంది వెయిట్ చేస్తున్నారు అంటే ఏ స్తాయిలో వెబ్ సిరీస్ లు జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలోనే నెట్‌ ఫ్లిక్స్ నుండి హెల్ బౌండ్‌ అనే కొత్త సిరీస్‌ రాబోతుంది. కొరియన్‌ నుండి రాబోతున్న ఈ వెబ్‌ సిరీస్ మరోసారి ప్రపంచాన్ని కుదిపేయబోతున్నట్లుగా సోషల్‌ మీడియా జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఈ సిరీస్ ట్రైలర్ అప్పుడే అంచనాలను పెంచేసింది. మరో స్క్విడ్ గేమ్‌.. మరో మనీ హెయిస్ట్‌ కాబోతుంది అంటూ చర్చ మొదలు అయ్యింది. నెట్‌ ఫ్లిక్స్ వెబ్‌ సిరీస్ లు హాలీవుడ్‌ సినిమాల రేంజ్ ను మించి ఉంటాయి అంటూ ప్రతి ఒక్కరు ఇప్పటికే ఒక అభిప్రాయంకు వచ్చారు. వారి అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా అద్బుతమైన హెల్‌ బౌండ్‌ ను తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు.

విజువల్ వండర్ గా ఉండబోతున్న ఈ వెబ్‌ సిరీస్ ను నవంబర్‌ 19న స్ట్రీమింగ్‌ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ సిద్దం అయ్యింది. ఆ తేదీ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్‌ అవుతుందా అంటూ ట్రైలర్‌ చూసిన ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్‌ యాక్షన్ సినిమా ల రేంజ్‌ లో ఈ సిరీస్ లో సన్నివేశాలు ఉంటాయనే నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్క ఓటీటీ ప్రేక్షకులు వెబ్‌ సిరీస్ లపై ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో హెల్‌ బౌండ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వ్యూస్ ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రీమింగ్‌ మొదలు అయిన తర్వాత హెల్‌ బౌండ్‌ గురించిన చర్చ విశిష్టంగా జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.