Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కు కొత్త ఐట‌మ్ గాళ్ వ‌చ్చేసింది!

By:  Tupaki Desk   |   6 Nov 2022 2:30 AM GMT
టాలీవుడ్ కు కొత్త ఐట‌మ్ గాళ్ వ‌చ్చేసింది!
X
'సింగ్ సాబ్ ది గ్రేట్ ' మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉత్త‌రాఖండ్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతెలా. సినిమాల్లో కంటే సోస‌ల్ మీడియాలో ద్వారా త‌న‌దైన మార్కు హాట్ ఫొటో షూట్ ల‌తో నెట్టింట వైర‌ల్ అవుతూ వ‌స్తోంది. సోష‌ల్ మీడియాలో 60 మిలియ‌న్ ల ఫాలోవ‌ర్స్ ని సొంతం చేసుకుని క్రేజీ హాట్ లేడీగా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. స‌న‌మ్ రే, హేట్ స్టోరీ 4, పాగ‌ల్ పంటీ వంటి సినిమాల‌తో బాలీవుడ్ లో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది.

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఊర్వ‌శీ రౌతేలా ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపుని సొంతం చేసుకోలేక‌పోయింది. హాట్ హాట్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారి యూత్ ఆడియ‌న్స్ లో హ్యూజ్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ప్ర‌త్యేక గీతాల్లో న‌ర్తిస్తూ స్పెష‌ల్ ఐట‌మ్ సాంగ్ ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది. సంప‌త్ నంది షో ర‌న్న‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన 'బ్లాక్ రోజ్‌' వెబ్ సిరీస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంది.

ఇదిలా వుంటే త‌న అందాల‌తో కుర్రాకారుని కిర్రెక్కిస్తున్నఊర్వ‌శీ రౌతేలా టాలీవుడ్ మేక‌ర్ ల‌కు కొత్త ఐట‌మ్ గ‌ళ్ గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల్లో ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంటూ వ‌స్తోంది. ఉస్తాద్ రామ్ హీరోగా యాక్ష‌న్ సినిమాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్ లో రూపొంద‌నున్న పాన్ ఇండియా మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఈ మూవీలోని ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం బాలీవుడ్ హాటీ ఊర్వ‌శీ రౌతేలానిఎంపిక చేసుకున్నారు.

ఈ సాంగ్ కంప్లీట్ కాక‌ముందే ఊర్వ‌శీ రౌతేలాకు మెగాస్టార్ చిరంజీవి నుంచి బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది. చిరు హీరోగా బాబి తెర‌కెక్కిస్తున్న మాస్ మ‌సాలా మూవీ 'వాల్తేరు వీర‌య్య‌'. మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో ఊర్వ‌శీ రౌతేలా ప్ర‌త్యేక ఐట‌మ్ సాంగ్ లో న‌టించే ఆఫ‌ర్ ని ద‌క్కించుకుంది. ఊర్వ‌శీ రౌతేలా న‌టించిన 'బ్లాక్ రోజ్‌'లో 'నా త‌ప్పు ఏమున్న‌ద‌బ్బా...' అంటూ సాగిన ప్ర‌త్యేక గీతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

దీంతో చిరుతో క‌లిసి ఊర్వ‌శీ రౌతేలా చేయ‌బోయే స్పెష‌ల్ సాంగ్ ఏ రేంజ్ లో ర‌చ్చ చేస్తుందోన‌ని అప్పుడే మెగా అభిమానులు ఆరాతీయ‌డం మొద‌లు పెట్టారు.

ఇదిలా వుంటే చిరు కాంబినేష‌న్ లో ఊర్వ‌శీ రౌతేలాపై స్పెష‌ల్ సాంగ్ షూట్ కోసం ప్ర‌త్యేక సెట్ ని ఏర్పాటు చేశారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ ఈ పాట కోసం అదిరిపోయే స్టెప్స్ ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సాంగ్ షూట్ మొద‌లు కానుంద‌ని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.