Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో కొత్త 'ఇజం' తెరపైకి వచ్చింది

By:  Tupaki Desk   |   13 Oct 2021 3:30 PM GMT
ఇండస్ట్రీలో కొత్త ఇజం తెరపైకి వచ్చింది
X
టాలీవుడ్.. బాలీవుడ్‌.. కోలీవుడ్‌ అన్ని వుడ్స్ లో కూడా నెపొటిజం.. ఫెవరెటిజం ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ప్రతి ఇండస్ట్రీలో ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఇండస్ట్రీలో ఇవి ఉన్నట్లుగానే.. ప్రతి చోట కూడా వాటిపై పోరాటం చేసే వారు ఉంటున్నారు. బాలీవుడ్‌ లో ఉన్న నెపొటిజం పై పోరాటం చేసేందుకు కంగనా రనౌత్‌ ఎప్పుడో కంకణం కట్టుకుంది. ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి ఆమె పడ్డ ఇబ్బందుల గురించి చెబుతూ ఎన్నో సందర్బాల్లో పలువురిని తీవ్రంగా విమర్శించిన విషయం తెల్సిందే. నెపొటిజం వల్ల ఎంతో మంది ప్రతిభావంతులు అయిన నటీ నటులు ఇండస్ట్రీలో కనీసం గుర్తింపు కూడా తెచ్చుకోలేక పోతున్నారు అనేది అందరు ఒప్పుకోవాల్సిన వాస్తవం. నెపొటిజంతో పాటు ఫెవరెటిజం కూడా ఇండస్ట్రీలో కొత్త ట్యాలెంట్‌ కు అవకాశాలు లేకుండా చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు.

ఇండస్ట్రీ లో చాలా మంది ప్రతిభావంతులు చాలా కారణాల వల్ల కనుమరుగవుతున్నారు. అందులో ఒకటి రేసిజం. ఈ రేసిజం వల్ల ప్రతిభ ఉన్న నటీ నటులు చాలా మంది రంగు పొడవు అందం పేర్లతో పక్కకు పెట్టబడుతున్నారు. రేసిజం అనేది ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నదే కాని ఇప్పుడు తెరపైకి వచ్చింది. అది కూడా బాలీవుడ్‌ స్టార్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ వ్యాఖ్యల వల్ల ఇండస్ట్రీ వర్గాల్లో దాని గురించిన చర్చ మొదలు అవుతోంది. ఇటీవల ఆయన నటించిన సీరియస్ మ్యాన్ అనే సినిమా లో హీరోయిన్ గా ఇందిరా తివారీ నటించింది. సినిమా లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. కాని ఆమె లుక్ పరంగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు ముందు ముందు ఆఫర్లు వస్తాయనే నమ్మకం లేదు అంటూ చాలా మంది బలంగా చెబుతున్నారు.

ఆ విషయమై నవాజుద్దీన్ స్పందిస్తూ.. బాలీవుడ్‌ లో రేసిజం వల్ల ఎంతో మంది ప్రతిభా వంతులు కనుమరుగు అవుతున్నారు. నల్లగా పొట్టిగా ఉన్నారు అంటూ చాలా మందిని పక్కకు పెడుతున్నారు. ట్యాలెంట్ ను చూసి ఆఫర్లు ఇవ్వాల్సిన వారు కాస్త రంగు హైట్‌ ను బట్టి ఇస్తున్నారు. వారికి తగ్గ పాత్రలు కూడా చాలానే ఉంటాయి. అయినా కూడా వాటికి వారిని ఎంపిక చేయడం లేదు. ఇండస్ట్రీలో రేసిజం వల్ల అందంగా లేని వారికి ఆఫర్లు రావడం లేదని.. ముఖ్యంగా ఈ వివక్ష ఎక్కువగా అమ్మాయిల్లో కనిపిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే నెపొటిజం.. ఫెవరేటిజం పేర్లతో విసిగి పోతుంటే కొత్తగా రేసిజం ఏంటి భయ్యా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆయన వాదన్ను సమర్థిస్తున్నారు.