Begin typing your search above and press return to search.
మెంటలెక్కిస్తున్న బన్నీ మాస్ లైనప్
By: Tupaki Desk | 21 Jun 2023 2:03 AM ISTఅల్లు అర్జున్.. మొదట్లో మెగా కాంపౌండ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తనదైన మార్కును చూపించాడు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టైలీష్ స్టార్ అయ్యాడు. ఇక పుష్ప సినిమాతో ఐకానిక్ స్టార్ గా మారి.. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తన 20వ సినిమా పుష్ప... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇక పుష్ప సినిమాకు కొనసాగింపుగా తన 21 సినిమాను బన్నీ.. పుష్ప 2 చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తొలి భాగంతో పోల్చితే రెండో భాగం గ్రాండ్ గా ఉండేలా దర్శకుడు సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే బన్నీ లైనప్ చూస్తే మెంటల్ ఎక్కాల్సిందే. వరుసగా స్టార్ డైరెక్టర్లతో తన సినిమాలు ఉన్నాయి.
అవి ఒకసారి పరిశీలిస్తే.. పుష్ప 2 సినిమా తర్వాత ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 22వ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తోడు హారికా హాసిని బ్యానర్ లో ఒకరైన నిర్మాత నాగవంశీ ట్విట్టర్ నుంచి ట్వీట్ రావడమే. ఇక ఈ సినిమాపై అప్పుడే అంచనాలు మొదలు అయ్యాయి..
ఆ తర్వాత తన 23వ సినిమాను సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి రణబీర్ కపూర్ తో యానిమాల్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయ్యాక బన్నీతో సినిమా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను టీసీరిస్ నిర్మించనుంది.
ఇక బన్నీ 24వ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ తో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమాను తీస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా అయ్యాక బన్నీ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు.
ప్రశాంత్ నీల్ తో కూడా అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇది ఇంకా కన్ఫార్మ్ కాలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తుండగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలి.
ఈ రెండు సినిమాల తర్వాత బన్నీతో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. మొత్తానికి బన్నీ లైనప్ చూస్తే ఎవరికైనా మెంటల్ ఎక్కాల్సింది. ఇక ఇంకో విషయం ఏమింటంటే.. బన్నీ చేయబోయే అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. ఈ సినిమాలు గనుక హిట్ అయితే... బన్నీ లెవెల్.. ఏ రేంజులో ఉంటుందో ఊహించలేం.