Begin typing your search above and press return to search.

చారిత్ర‌క‌ ప్రేమ‌క‌థ‌లో అందాల రాశి?

By:  Tupaki Desk   |   6 Dec 2020 8:00 PM IST
చారిత్ర‌క‌ ప్రేమ‌క‌థ‌లో అందాల రాశి?
X
చారిత్ర‌క నేప‌థ్యం అంటే అది పాన్ ఇండియా కేట‌గిరీనే. ఇలాంటి సినిమాల్లో ఆఫ‌ర్ అంటే ఆషామాషీ కాదు. భారీగా పారితోషికం ముడుతుంది. అందుకు త‌గ్గ‌ట్టే కాస్త ఎక్కువ‌ కాల్షీట్లు కేటాయించాలి. ఒక‌వేళ ఈ మూవీ స‌క్సెసైతే ఆ త‌ర్వాత రేంజు కూడా మారుతుంది. మ‌రి అలాంటి ఆఫ‌ర్ వ‌స్తే కాద‌ని అన‌గ‌ల‌రా? ప‌్ర‌స్తుతం అలాంటి హిస్టారిక‌ల్ ప్రేమ‌క‌థా చిత్రానికి అందాల రాశీ ఖ‌న్నా సంత‌కం చేసింద‌ట‌.

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ - హను రాఘ్వాపుడి కలయికలో ఓ హిస్టారిక‌ల్ మూవీకి స‌న్నాహ‌కాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని కొన్ని నెలల క్రితం ప్రకటించారు. మహానటి మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండ‌గా స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

ప్ర‌స్తుతం ఈ మూవీ ప్రీప్రొడ‌క్ష‌న్ పనులపై తాజా అప్ డేట్ అందింది. ఈ చిత్రంలో క‌థానాయిక‌ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేని లాక్ చేయ‌గా.. అందాల రాశి ఖన్నాతో వేరొక ప్రధాన పాత్ర కోసం చర్చలు జరుపుతున్నార‌ని తెలిసింది. అంటే పూజా హెగ్డే- రాశీఖ‌న్నాల‌తో ఫ్రేమ్ ని వ‌ర్ణ‌రంజితంగా మార్చాల‌న్న‌ది హ‌ను ప్లాన్ అని అర్థ‌మ‌వుతోంది.

ఇది చ‌రిత్ర నేప‌థ్యంలో ఒక అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని భ‌న్సాలీ త‌ర‌హాలో ప్ర‌తి ఫ్రేమ్ ని వ‌ర్ణ‌రంజితంగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నాటి కాలం ప్రేమకథలో దుల్కర్ రామ్ అనే ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ ‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభమవుతుంది.