Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన జపాన్‌ ఫ్యాన్‌

By:  Tupaki Desk   |   13 Dec 2020 2:51 PM IST
ఎన్టీఆర్‌ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన జపాన్‌ ఫ్యాన్‌
X
ఒకప్పుడు తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ కు జపాన్‌ తో పాటు కొన్ని దేశాల్లో విపరీతమైన అభిమానులు ఉండేవారు. అక్కడ సబ్‌ టైటిల్స్‌ తో లేదా ఇంగ్లీష్‌ లో రజినీకాంత్‌ సినిమాలు విడుదల చేసేవారు. ఆ తర్వాత పలువురు స్టార్స్‌ కూడా విదేశాల్లో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. చాలా కాలం నుండే ఎన్టీఆర్ కు జపాన్‌ లో అభిమానులు ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎన్టీఆర్‌ సినిమాలు అక్కడ సందడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఎన్టీఆర్‌ పాటలను అక్కడ అభిమానులు ఎంజాయ్‌ చేయడం.. ఆ పాటలకు డాన్స్‌ లు చేయడం వంటివి చేస్తున్నారు.

ఇటీవల ఎన్టీఆర్‌ నాన్నకు ప్రేమతో సినిమాలోని లవ్‌ దెబ్బ పాటను ఒక జపాన్‌ జంట ఆకట్టుకునే విధంగా పెర్ఫార్మెన్స్‌ చేశాయి. అచ్చు ఎన్టీఆర్‌ మరియు రకుల్‌ లు ధరించినటువంటి కాస్ట్యూమ్స్‌ ను ధరించడంతో పాటు అచ్చు డాన్స్‌ ను అలాగే చేశారు. అదే విధంగా కెమెరా షాట్స్‌ ను కూడా అచ్చు గుద్దినట్లుగా అనుకరించారు. వారు చేసిన ప్రయత్నంకు నందమూరి అభిమానులు పిదా అవుతున్నారు. ఒక రూంలో వారు అదంతా చేయడం నిజంగా అభినందనీయం అంటూ నందమూరి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జపాన్‌ ఎన్టీఆర్‌ అభిమాన జంట వేసిన స్టెప్పులు నెట్టింట వైరల్‌ అవ్వబోతున్నాయి. ఈ పాటను మీరు ఒక లుక్కేయండి.