Begin typing your search above and press return to search.

`మారో మారో`..చై వేగాన్ని ఆపెదెవ‌రు?

By:  Tupaki Desk   |   9 Jun 2022 1:04 PM GMT
`మారో మారో`..చై వేగాన్ని ఆపెదెవ‌రు?
X
యువ సామ్రాట్ నాగ చైత‌న్య క‌థానాయ‌కుడిగా విక్ర‌మ్.కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `థాంక్యు` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కోవిడ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్య‌మ‌వ్వ‌డంతో ఇన్నాళ్లు రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. తాజాగా రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ట్లు సంకేతాలు వచ్చేస్తున్నాయి.

ఇటీవ‌లే సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్ రిలీజ్ చేసి ఆన్ ది వే అన్న సంకేతాన్ని అభిమానుల్లోకి వ‌దిలేసారు. దీంతో `థాంక్యూ` చెప్ప‌డానికి చై సిద్ద‌మ‌వుతున్న‌ట్లు అర్ధ‌మైంది. ఆ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమా టీజ‌ర్..ట్రైల‌ర్ ఎలా ఉంటుంద‌న్న‌? ఉత్సాహం అభిమానుల్లో మొద‌లైంది. అంత‌క‌న్నా ముందే యూనిట్ ప్రోమోల‌తో..లిరిక‌ల్ సింగిల్స్ తో హీటెక్కించే ప‌నులు మొదలు పెట్టిన‌ట్లు కనిపిస్తుంది.

తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే `మారో మారో` సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. ఇందులో హాకీ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ని హైలైట్ చేస్తూ ప్రోమోని వ‌దిలారు. శుక్ర‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు మొత్తం లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇక ప్రోమో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇది క్రీడా నేప‌థ్యం గ‌ల చిత్రంలా క‌నిపిస్తుంది. స్పోర్స్ట్ దుస్తుల్లో చైత‌న్య ఆక‌ట్టుకుంటున్నాడు.

ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు కెప్టెన్ తో చైత‌న్య పొరాటం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మ‌రి విజువ‌ల్ గా ఈ పోటీ ఎంత కిక్ ఇస్తుంద‌న్న‌ది చూడాలి. అయితే ఈప్రోమోలో ఎక్క‌డా సినిమా రిలీజ్ తేదీని ప్ర‌క‌టించ‌లేదు. దీన్ని బ‌ట్టి సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇంకా స‌మ‌యం ప‌డుతుందా? అన్న సందేహం మ‌రోవైపు మొద‌లుతుంది. మ‌రి రేప‌టి లిరిక‌ల్ సాంగ్ లో రిలీజ్ తేదీపై ఏదైనా క్లారిటీ దొరుకుతుందేమో చూడాలి.

సినిమాకి సంబంధించి టీజ‌ర్..ట్రైల‌ర్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అవి ఎప్పుడు? అంటూ సందేశాలు పాస్ చేస్తున్నారు. ఇందులో చైత‌న్య‌కి జోడీగా రాశీఖ‌న్నా న‌టిస్తుంది. ఇంకా మాళ‌వికా నాయ‌ర్..అవికాగోర్ సెకెండ్ లీడ్స్ పోషిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై దిల్ రాజు..శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.