Begin typing your search above and press return to search.

హీరోపై చెప్పు విసిరిన మరో హీరో ఫ్యాన్..!

By:  Tupaki Desk   |   20 Dec 2022 3:53 AM GMT
హీరోపై చెప్పు విసిరిన మరో హీరో ఫ్యాన్..!
X
పరిశ్రమ ఏదైనా సరే స్టార్స్ మధ్య సినిమాలతో పోటీ ఉంటుండగా ఆ స్టార్ ఫ్యాన్స్ మధ్య కూడా రసవత్తరమైన పోటీ ఉంటుంది. లేటెస్ట్ గా కన్నడ పరిశ్రమలో ఒక స్టార్ హీరో అభిమాని మరో స్టార్ హీరో మీద ఏకంగా చెప్పు విసిరడం హాట్ న్యూస్ గా మారింది. కన్నడ స్టార్ దర్శన్ ప్రస్తుతం ఆయన చేస్తున్న క్రాంతి సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా దర్శన్ పై దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అభిమాని ఒకరు చెప్పు విసిరాడు. తమ హీరో పట్ల దర్శన్ ప్రవర్తన నచ్చకపోవడం వల్లే అతను అలా చేశాడని అంటున్నారు.

అసలు ఇంతకీ దర్శన్ ని పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ ఎందుకు టార్గెట్ చేశారు అంటే.. పునీత్ మరణం ఆయన ఫ్యాన్స్ ని శోక సముద్రంలో ముంచేసింది. కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. అందుకే ఆయన తీసిన చివరి సినిమాని కూడా భారీ రేంజ్ లో హిట్ చేశారు.

అయితే దర్శన్ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తన అభిమానులు తనని ఎంతగానో ప్రేమిస్తున్నారు అని.. ఎక్సాంపుల్ కి పునీత్ ని తీసుకుంటే.. ఆయన చనిపోయాక ఆయన ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. కానీ నేను బ్రతికి ఉండగానే ఫ్యాన్స్ ప్రేమని పొందుతున్నానని అన్నారు. ఈ కామెంట్స్ పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ ని తీవ్రంగా గాయపరచింది.

ఆ కోపంతోనే దర్శన్ పాల్గొన్న ప్రమోషనల్ ఈవెంట్ లో పునీత్ ఫ్యాన్ పాల్గొని అతని మీద చెప్పు విసిరాడు. దర్శన్ ఈ సంఘటనపై స్పందిస్తూ ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేయడం ఏమాత్రం తగదని అన్నారు. అందరం కాస్త మనుషుల్లా ప్రవర్తిద్దాం అని అన్నారు.

చెప్పు విసిరిన వ్యక్తిని ఏమీ చేయవద్దని ఆయన తన టీం కి చెప్పారు. అయితే తను ఏ ఉద్దేశంతో మరణించిన పునీత్ ని అన్నారో కానీ అప్పటి నుంచి దర్శన్ పై పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ పగ బట్టారు. దర్శన్ పై పునీత్ ఫ్యాన్ చెప్పు విసిరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దర్శన్ నటించిన క్రాంతి సినిమా జనవరిలో రిలీజ్ అవుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు. కన్నడలో తన సినిమాలతో ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్న దర్శన్ అక్కడ స్టార్ స్టేటస్ తెచ్చుకున్నారు. కానీ మరణించిన సహ నటుడు గురించి అలా స్పందించడం కరెక్ట్ కదన్నది కొందరు వాదన. దీన్ని పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ కానీ.. దర్శన్ కానీ ఇంకా కొనసాగించకుండా ఉంటే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు మిగతా ఫ్యాన్స్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.