Begin typing your search above and press return to search.

మంచి స్నేహితుడా? మంచి ప్రేమికుడా జానూ?

By:  Tupaki Desk   |   14 Dec 2022 12:30 PM GMT
మంచి స్నేహితుడా? మంచి ప్రేమికుడా జానూ?
X
ఎవ‌రైనా స‌హ‌చ‌రుడితో లింక‌ప్ క‌థ‌నాలు అల్ల‌డం బాలీవుడ్ మీడియా అల‌వాటు. స్కూల్ కాలేజ్ ఫ్రెండ్ లేదా సుప‌రిచితుడో బంధువో అందాల క‌థానాయిక‌తో జంట‌గా కనిపిస్తే చాలు వెంట‌ప‌డి కెమెరాలతో క్లిక్ మ‌నిపించ‌డం దానికి ఒక అంద‌మైన క‌ట్టుక‌థ‌ను అల్లేయ‌డంలో ముంబై మీడియాలో సిద్ధ‌హ‌స్తులున్నారు.

బ‌రువైన కెమెరాలు మోస్తూ టంచ‌నుగా సెల‌బ్రిటీ క‌వ‌రేజీ కోసం ఆరాట‌ప‌డే కెమెరామెన్ల‌కు వారితో పాటు ఉండే జ‌ర్న‌లిస్టుల‌కు ప‌రిశ్ర‌మ‌లోని ఎన్నో సీక్రెట్స్ తెలుసు. కానీ ఒక్కో లైన్ మాత్ర‌మే రివీల్ చేస్తూ చిన్న‌పాటి హింట్ ఇస్తూ రీడ‌ర్ ని ఆట‌ప‌ట్టిస్తుంటారు.

సారా అలీఖాన్- అన‌న్య పాండే- సుహానా ఖాన్- ఖుషీ క‌పూర్ సహా చాలా మంది సెల‌బ్రిటీ కిడ్స్ పై ర‌హ‌స్యాల‌ను ఛేధించిన ఘ‌న‌త‌ ముంబై మీడియాకి ఉంది. అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ త‌న వ్య‌క్తిగ జిమ్ కోచ్ తో ప్రేమ‌లో ఉంద‌ని ఇంత‌కుముందు లీక్ చేసిన మీడియా ఇటీవ‌లే నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వీడియోల‌ను రివీల్ చేసింది.

ఇటీవ‌ల జాన్వీక‌పూర్ పై మీడియాలో విప‌రీతమైన క్యూరియాసిటీ క‌నిపిస్తోంది. ఈ అమ్మ‌డు ఎక్క‌డ క‌నిపించినా వెంట‌పడి ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతోంది. అంతేకాదు.. జాన్వీ ఏ యువ‌కుడితో క‌నిపించినా లింక‌ప్ పెట్టి వార్త‌లు రాస్తోంది. ఇటీవ‌ల యువ‌హీరో కార్తీక్ ఆర్య‌న్ తో జాన్వీ క‌పూర్ డేటింగ్ చేసింద‌ని రూమ‌ర్లు వినిపించాయి. అంత‌కుముందు 'ధ‌డ‌క్' స‌మ‌యంలో త‌న హీరో ఇషాన్ ఖ‌త్త‌ర్ తోను ప్రేమ‌లో మునిగింద‌ని.. ఆ త‌ర్వాత ఒక ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయ‌కుడి కుమారుడితో షికార్లు చేస్తోంద‌ని కూడా కొన్ని స్టోరీలు వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు మ‌రో చిన్న‌నాటి స్నేహితుడు.. ప‌రిశ్ర‌మేత‌ర యువ‌కుడు ఓర్హాన్ అవత్రమణితో ప్రేమాయ‌ణం సాగిస్తోందంటూ ముంబై మీడియా క‌థ‌నాలు అల్లుతోంది. దానికి త‌గ్గ‌ట్టే జాన్వీ క‌పూర్ చాలాసార్లు ఓర్హాన్ తో పార్టీల్లో క‌నిపించింది.

ఇటీవ‌ల ఓ రెడ్ కార్పెట్ ఈవెంట్లో జాన్వీ కపూర్ అత‌డితో ప్ర‌త్య‌క్ష‌మైంది. అంగ‌రంగ వైభ‌వంగా సాగిన అవార్డ్ ల వేడుక‌లో ఓర్హాన్ తో కలిసి కెమెరాల‌కు ఫోజులిచ్చింది. స్నేహితుడు(ప్రేమికుడు) తో కలిసి రెడ్ కార్పెట్ పై హొయ‌లు పోవ‌డం కనిపించింది. జాన్వీ కపూర్ తొలిగా ఫోటోషూట్ ముగించి తర్వాత రెడ్ కార్పెట్ పై కి రావాల‌ని ఓర్హాన్ ను పిలిచింది. రెడ్ కార్పెట్ మీద ఇద్దరూ చేతులు పట్టుకుని నవ్వుతూ కనిపించారు. ఈవెంట్ కోసం.. అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన నియాన్ గ్రీన్ దుస్తులను జాన్వీ కపూర్ ఎంచుకుంది.

చాలా కాలంగా ఓర్హాన్ తో జాన్వీ సాన్నిహిత్యంపై చ‌ర్చ సాగుతోంది. అది స్నేహ‌మా లేక ప్రేమాయ‌ణ‌మా? అన్న‌దానిపై ఎవ‌రూ పెద‌వి విప్పడం లేదు. మీడియా గాసిప్పుల‌కు ఈ జంట స్పందించ‌డం లేదు. ఇటీవలే మాల్దీవుల వెకేష‌న్ నుండి తిరిగి వచ్చిన జాన్వీ కపూర్ వ‌రుస‌గా వేడెక్కించే ఫోటోషూట్ ని షేర్ చేసింది. "ఇప్పటికీ ఉష్ణమండలంలో ఉన్న‌ట్టుంది! అని వ్యాఖ్య‌ను జోడించగా.. ఓర్హాన్ ప్ర‌తిస్పందిస్తూ-"అద్భుతం" అని పొగిడేశాడు.

జాన్వీ కపూర్ - ఓర్హాన్ తరచుగా వారి ఇన్ స్టాగ్రామ్ ఎక్స్ ఛేంజ్‌ల ట్రెండ్ లలో కనిపిస్తారు. మాల్దీవుల నుండి జాన్వీ పోస్ట్ ని షేర్ చేయ‌గానే ఓర్హాన్ ఒక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేసాడు. "మేము దగ్గరగా ఉన్నా కూడా నేను ఒక ద్వీపంలో ఉన్నాను" అని కొటేష‌న్ రాసాడు. ఓసారి ఓర్హాన్ కి చెందిన‌ హాలోవీన్ ఫోటో ఆల్బమ్ షేర్ చేస్తూ.. 'మిస్ యు బేబీ' అని జాన్వీ క‌పూర్ వ్యాఖ్యానించింది. ఆ ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌ను కురిపించ‌డం ప్ర‌తిసారీ బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. కానీ ఇది డేటింగా లేక కేవ‌లం స్నేహ‌మా? అన్న‌దానిపై జాన్వీనే స్వ‌యంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

రాజ‌కీయ నాయ‌కుడి కుమారుడితో..!? అవ్ర‌త‌మ‌ణి కంటే ముందే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా జాన్వీ స‌న్నిహితంగా క‌నిపించ‌డం వేడెక్కించింది. అతను గతంలో జాన్వీ కపూర్ తో డేటింగ్ చేసాడని క‌థ‌నాలొచ్చాయి. అయితే శిఖ‌ర్ ఆ తరువాత జాన్వీ నుంచి విడిపోయాడు. కరణ్ జోహార్ తన చాట్ షో.. కాఫీ విత్ కరణ్ 7 లో వారి డేటింగ్ పుకార్లను దాదాపుగా ధృవీకరించారు. జాన్వీ ఇటీవల ముంబైలో శిఖర్ తో షికార్లు చేస్తూ కెమెరా కంటికి చిక్కిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇటీవ‌ల‌ మాల్దీవుల విహారంలో ఈ కొత్త జంట కొన్ని లీకులివ్వ‌డం హాట్ టాపిక్ అయ్యింది. అవ్ర‌త‌మ‌ణితో పాటు శిఖ‌ర్ కూడా జాన్వీకి స్నేహితుడు అని మాత్రం తెలిసింది.

ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్వీకి ఇప్పటివరకు 2022 సంవత్సరం కెరీర్ ప‌రంగా ఎంతో క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పాలి. గుడ్ లక్ జెర్రీ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. జూలైలో డిస్నీ+ హాట్ స్టార్ లో విడుదలైన ఈ చిత్రంలో జాన్వీ ప్రధాన పాత్రను పోషించింది. సిద్ధార్థ్ సేన్ గుప్తా దీనిని తెర‌కెక్కించారు. గత నెలలో థియేటర్లలో విడుదలైన మిలీలో ఉత్త‌మ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఆమె తండ్రి బోనీ కపూర్ నిర్మించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ లోను ప్రధాన పాత్రను పోషించింది. త‌దుప‌రి వరుణ్ ధావన్ తో కలిసి 'బవాల్' లో కనిపించనుంది. ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. రాజ్ కుమార్ రావుతో కలిసి 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' కూడా సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ క్రికెటర్ పాత్రలో కనిపించనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.