Begin typing your search above and press return to search.

మృణాల్ ని పెళ్లి చేసుకుంటానన్న ఫ్యాన్.. ఆమె ఆన్సర్ ఏంటంటే..!

By:  Tupaki Desk   |   28 Feb 2023 3:59 PM
మృణాల్ ని పెళ్లి చేసుకుంటానన్న ఫ్యాన్.. ఆమె ఆన్సర్ ఏంటంటే..!
X
అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా సరే సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ కి సూపర్ క్రేజ్ వచ్చింది. అమ్మడు ఆ ఒక్క సినిమాతో సౌత్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక తెలుగు ఆడియన్స్ అయితే మృణాల్ ని బాగా ఇష్టపడుతున్నారు.

తనకు వచ్చిన ఈ ఫాలోయింగ్ క్రేజ్ చూసి మృణాల్ ఠాకూర్ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం మృణాల్ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ఇంకా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటుంది. లేటెస్ట్ గా మృణాల్ ఠాకూర్ కి పెళ్లి ప్రపోజల్ పెట్టేశాడు ఫ్యాన్.

మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నా వైపు నుంచి ఓకే అంటూ అతను కామెంట్ పెట్టాడు. దీనికి రిప్లై గా మృణాల్ మాత్రం నా వైపు నుంచి ఓకే కాదుగా అని పెట్టేసింది. అభిమాని అడిగిన ప్రశ్నకు సరదాగా రెస్పాన్స్ ఇచ్చింది మృణాల్.

సాధారణంగా అయితే ఫ్యాన్స్ ఇలాంటి మెసేజ్ లు ఎన్నో చేస్తుంటారు కానీ దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం తన అభిమాని చేసిన పెళ్లి ప్రపోజల్ కి స్వీట్ ఆన్సర్ ఇచ్చింది. సీతారామం సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ క్రేజ్ తో వచ్చిన ప్రతి సినిమా చేయకుండా సెలెక్టెడ్ గా కథలను ఎంపిక చేసుకుంటుంది.

ఈమధ్యనే నాని సినిమాలో హీరోయిన్ గా ఓకే అవగా బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా అక్షయ్ కుమార్ సెల్ఫీ లో నటించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో తనకు వచ్చిన ఈ స్పెషల్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్ ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. తెలుగులో టాప్ చెయిర్ మీద కన్నేసిన మృణాల్ ఇక్కడ స్టార్ ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తుంది. నాని సినిమాతో పాటుగా తెలుగులో మరో స్టార్ సినిమా కూడా చర్చల దశలో ఉందని తెలుస్తుంది.

సీతారామం తో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచనతో కాకుండా కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యింది మృణాల్ ఠాకూర్. తెలుగులోనే కాదు కోలీవుడ్ నుంచి అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయని టాక్. ఓ పక్క బాలీవుడ్ సినిమాలు చేస్తూ సౌత్ సినిమాల మీద ఫోకస్ చేస్తుంది మృణాల్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.