Begin typing your search above and press return to search.

హీరోనే మోసం చేసిన అమ్మాయి.. పోలీసులకు హీరో ఫిర్యాదు

By:  Tupaki Desk   |   3 July 2020 3:30 PM GMT
హీరోనే మోసం చేసిన అమ్మాయి.. పోలీసులకు హీరో ఫిర్యాదు
X
తమిళ హీరో, తెలుగువాడైన విశాల్ తమిళ సినీ రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డారు. అటు వైవిధ్యమైన సినిమాలే కాదు.. ఇటు తమిళ ఇండస్ట్రీ రాజకీయాలను విశాల్ శాసిస్తున్నాడు. నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఎంతో చురుకుగా అన్ని వ్యవహారాల్లో నిక్కచ్చగా ఉండి హీరో విశాల్ ను ఓ ఆర్థిక వ్యవహారంలో ఓ అమ్మాయి దారుణంగా మోసం చేసిన వైనం చర్చనీయాంశమైంది.

విశాల్ సొంత నిర్మాణ సంస్థ ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’లో ఈ ఆర్థిక వ్యవహారం బయటపడింది. ఈ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ మహిళే ఈ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు తెలిసింది. ఆరేళ్లుగా విశాల్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఆమె పలు దఫాల్లో కోట్లు కొల్లగొట్టినట్టు తెలిసింది. ఇటీవలే ఆమె 45 లక్షలు పెట్టి ఓ ఇంటిని కొనుగోలు చేయడంతో ఆమెపై అనుమానం కలిగింది.

డబ్బులు మాయంపై విచారణ జరిపిన విశాల్ కు ఈ మహిళనే చాలా రోజులుగా కాజేస్తోందని ఆడిటింగ్ లో తేలడంతో వెంటనే విశాల్ ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మహిళ మోసం బయటపడింది.

ప్రస్తుతం విశాల్ ‘చక్ర’ అనే సైబర్ మోసాల సినిమాలో నటిస్తున్నాడు. తుప్పారివాలన్2 అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోగా , నిర్మాతగా రాణిస్తున్న విశాల్ ను ఓ మహిళ అడ్డంగా మోసం చేసి బుక్ చేయడం సంచలనమైంది.