Begin typing your search above and press return to search.

క్లాసిక్ టైటిల్ తో మరో క్రైమ్ కామెడీ!

By:  Tupaki Desk   |   30 Dec 2018 6:29 AM GMT
క్లాసిక్ టైటిల్ తో మరో క్రైమ్ కామెడీ!
X
చేసింది తక్కువ సినిమాలే అయినా టాలెంటెడ్ యాక్టర్ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకునే ఈ టాలీవుడ్ హీరో తన నెక్స్ట్ సినిమాకు ఒక క్రైమ్ కామెడీని ఎంచుకున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జోరుగా సాగుతోందని సమాచారం.

శ్రీవిష్ణుతో గతంలో 'మెంటల్ మదిలో' చిత్రాన్ని రూపొందించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకుడు. ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో బలమైన స్క్రీన్ ప్లే తో ఈ క్రైమ్ కామెడీని తెరకెక్కిస్తున్నారట. 'బ్రోచేవారెవరురా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఈమధ్య క్లాస్ టచ్ ఉండే టైటిల్స్ ను క్రైమ్ థ్రిల్లర్లకు క్రైమ్ కామెడీలకు పెట్టడం ఒక ట్రెండ్ గా మారింది. శ్రీవిష్ణు- వివేక్ ఆత్రేయ అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఇలాంటి టైటిల్ ను ఎంచుకున్నట్టుగా ఉన్నారు.

ఈ సినిమాలో నివేద థామస్.. నివేద పెతురాజ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఎం. విక్రమ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. శ్రీవిష్ణు ప్రతి సినిమలోనూ తన నటనకు మంచి మార్కులే తెచ్చుకుంటున్నాడు గానీ ఇంతవరకూ సాలిడ్ గా ఒక్క హిట్ కూడా తగలలేదు. మరి ఈ సినిమాతోనైనా శ్రీవిష్ణుకు కమర్షియల్ హిట్ లభిస్తుందేమో వేచి చూడాలి.