Begin typing your search above and press return to search.

ప్ర‌క‌ట‌న కోసం శృంగారంలో జీవించిన జంట‌

By:  Tupaki Desk   |   8 Oct 2022 4:55 AM GMT
ప్ర‌క‌ట‌న కోసం శృంగారంలో జీవించిన జంట‌
X
ఒకే ఏడాది ఒకే సీజ‌న్ లో రిలీజ‌య్యాయి పుష్ప‌.. అంటే సుంద‌రానికి. ఈ సినిమాల కోసం మాలీవుడ్ పాపుల‌ర్ జంట ఫ‌హ‌ద్- న‌జ్రియా కేర‌ళ టు హైద‌రాబాద్ వ‌రుస ప్ర‌యాణాల గురించి తెలిసిందే. ఓవైపు ఫ‌హ‌ద్ ఫాజిల్ 'పుష్ప' చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్న స‌మ‌యంలోనే.. అత‌డి భార్య న‌జ్రియా న‌జీమ్ నాని స‌ర‌స‌న 'అంటే సుంద‌రానికి' చిత్రంలో న‌టించింది. ఆ ఇరువురూ క‌లిసే షూటింగుల కోసం అటూ ఇటూ ప్ర‌యాణాలు సాగించారు. అదంతా అటుంచితే పుష్ప చిత్రం బంపర్ హిట్ కాగా 'అంటే సుంద‌రానికి' బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఆశించిన రేంజుకు చేరని సంగ‌తి తెలిసిందే.

ఇక పుష్ప‌లో నువ్వా నేనా? అంటూ పుష్ప‌రాజ్ వ‌ర్సెస్ భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ పోరు గురించి తెలిసిందే. పుష్ప చిత్రానికి షెకావ‌త్ పాత్ర పెద్ద ప్ల‌స్. భన్వర్ సింగ్ షెకావత్ గా ఫ‌హ‌ద్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిసాయి. భయంకరుడైన క్రూరుడైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పాత్ర‌లో అత‌డు మెరుపులు మెరిపించాడు.

క‌నిపించింది కొద్ది సేపే అయినా అద‌ర‌గొట్టాడ‌న్న టాక్ వినిపించింది. మ‌ల‌యాళంలో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌తో అవార్డులు రివార్డులు కొల్ల‌గొట్టిన ఫ‌హ‌ద్ కి పుష్ప లో షెకావ‌త్ పాత్ర లో చేయ‌డం ఏమంత క‌ష్టం కాలేద‌ని ప్రూవైంది.

ఇక తెర‌పై విల‌న్ గా అద‌ర‌గొట్టిన ఫ‌హ‌ద్ హీరోయిన్ నజ్రియా నజీమ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ అందమైన ప్రేమకథ అందరికీ తెలుసు. తాజాగా ఈ జోడీ ఓ ప్ర‌క‌ట‌న కోసం ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

పాపుల‌ర్ ఐస్ క్రీం ప్రకటన కోసం ఈ జంట న‌టించారు. ఇప్పటికే ఫహద్-నజ్రియా నటించిన రెండు ప్రకటనల్లో న‌టించారు. అవి ఒకే బ్రాండ్ కు సంబంధించినవి. ఈసారి ఆ ఇద్ద‌రి న‌డుమా రొమాన్స్ ఒక రేంజులో వ‌ర్క‌వుటైంది. నిజ‌మైన ప్రేమ‌.. భార్య భ‌ర్త‌ల అనుబంధం ఈ వీడియోలో హైలైట్ అయ్యింది.

శృంగారం అంటే ఇదీ అనేంత‌గా ఈ జంట తెర‌పై చెల‌రేగిపోయింద‌ని చెప్పాలి. ఫహద్ - నజ్రియా అంద‌మైన జంట‌. అంత‌కుమించి అన్యోన్య‌మైన జంట‌. ప్ర‌క‌ట‌న‌లో ఇద్దరూ అద్భుతంగా కనిపించారు. ప‌రిశ్ర‌మ‌లో బెస్ట్ న‌టులుగా ఇప్ప‌టికే నిరూపించుకున్నారు. ఆ ఇద్ద‌రి క్రేజ్ ను బ్రాండ్లు ఎన్ క్యాష్ చేసుకుంటున్నాయిలా. తాజా ప్ర‌క‌ట‌న‌లో ఆ ఇద్ద‌రూ న‌టించారు అనే కంటే జీవించారు అంటే త‌ప్పేమీ కాదు. అంత అందంగా ఈ జంట మ‌ధ్య రొమాన్స్ కుదిరింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.