Begin typing your search above and press return to search.

కొత్తవి తగ్గితే ఆ సినిమాలకు పండగే

By:  Tupaki Desk   |   25 Jun 2016 10:57 AM GMT
కొత్తవి తగ్గితే ఆ సినిమాలకు పండగే
X
ఈ శుక్రవారం థియేటర్లలోకి 3 సినిమాలు రావాల్సి ఉండగా.. శర్వా-నిత్యాల రాజాధిరాజా అసలు విడుదల కాకుండానే ఆగిపోయింది. నాగశౌర్య-నీహారికల ఒక మనసు.. ముళ్లపూడి వర తెరకెక్కించిన కుందనపు బొమ్మ థియేటర్లలోకి వచ్చాయి. రెండు సినిమాలకు మంచి టాక్ రాలేదు.

నీహరిక అరంగేట్రంపై అంచనాలతో ఫస్ట్ డే నూన్ షోకి విపరీతంగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ సినిమాలో సబ్జెక్ట్ బాగున్నా.. స్లో నెరేషన్ బాగా బ్యాడ్ అయిపోయింది. తొలిరోజు తర్వాత ఏకంగా 14 నిమిషాల సినిమా కట్ చేశారంటే.. బోర్ అనే టాక్ ఏ రేంజ్ టాక్ ఉందో అర్ధమవుతుంది. ఇక కుందనపు బొమ్మ అయితే పరిస్థితి అయితే మరీ దారుణం.. ఓపెనింగ్స్ కూడా సరిగాలేవు. దీంతో ఇప్పటికే థియేటర్లలో ఉన్న సినిమాలకు పండగే అవుతోంది. ముఖ్యంగా నాని జెంటిల్మన్ కి అయితే.. అనుకోని అదృష్టం అని చెప్పాల్సిందే. తొలి వీకెండ్ లో 9 కోట్ల వరకూ షేర్ రాబట్టిన జెంటిల్మన్.. ఆ తర్వాత స్లో అయింది.

వారం మొత్తంలో జెంటిల్మన్ ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ 12 కోట్లు దాటాయి. ఈవారంలో రాబట్టుకునే అవకాశం ఈ సినిమాకి దక్కింది. ఈ వీకెండ్ ముగిసేనాటికి బ్రేక్ ఈవెన్ కి వచ్చేస్తుందనే అంచనాలున్నాయి. ఇక.. ఇప్పటికే నెమ్మదించిన అ..ఆ.. కి కూడా వీకెండ్ లో మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. బిచ్చగాడు మాత్రం ఇంకా బాక్సాఫీస్ దగ్గర కళకళలాడుతూనే ఉన్నాడు.