Begin typing your search above and press return to search.

టీజర్‌ టాక్‌: అ..ఆ సింపుల్‌ గా సూపర్‌

By:  Tupaki Desk   |   13 April 2016 5:07 PM IST
టీజర్‌ టాక్‌: అ..ఆ సింపుల్‌ గా సూపర్‌
X
అసలు ఏ పెద్ద హీరోతోనో సినిమా చేస్తాడని అనుకుంటున్న తరుణంలో.. ఎవరో కొత్త దర్శకుడితో సినిమా చేస్తాడని అందరూ అనుకుంటున్నప్పుడు.. త్రివిక్రమ్‌ అండ్‌ నితిన్‌ లో తమ కాంబినేషన్లో సినిమా వస్తోందని ప్రకటించి షాకిచ్చారు. పైగా ఆ సినిమా పేరు ''అ..ఆ'' అని పెట్టి ఇంకో షాకిచ్చారు. మరోసారి ఏదో ఫ్యామిలీ డ్రామా తీస్తున్నారని చెప్పకనే చెబుతున్నారు. కాకపోతే ఇది ఒక లవ్‌ స్టోరీ తెలుసా.

చెప్పినట్లే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ''అ..ఆ'' టీజర్‌ విడుదలైంది. ఊహించినట్లే మాంచి లవ్‌ ఎలిమెంట్లతో ఈ టీజర్‌ సర్పరైజ్‌ చేసింది. ''అనసూయ రామలింగం.. అ.. ఆనంద్‌ విహారి.. ఆ.. '' అంటూ క్యారెక్టర్లను మనకు పరిచయం చేశాడు త్రివిక్రమ్‌. ఇంతలో సమంత డైలాగ్‌.. ''పక్కపక్కనే ఉండే అక్షరాలు.. పరిచయం కావడానికి పాతికేళ్లు పట్టింది'' అంటూ ఈ కథలో ఏదో జరగబోతోంది అనే హింట్‌ ఇచ్చింది. టీజర్‌ సింపుల్‌ గా అదిరిందిలే.

త్రివిక్రమ్‌ డైరక్షన్‌ లో రూపొందుతున్న ''అ..ఆ'' సినిమా విజయం సాధించడం.. నితిన్‌ కు ఎంతో కీలకం. అంతే కాకుండా దాదాపు సంవత్సరం తరువాత మళ్ళీ సమంత తెలుగు తెరపై డైరెక్టు సినిమాతో కనిపిస్తోంది. చూద్దాం ఈసారి ఏం మ్యాజిక్‌ చేస్తారో!!