Begin typing your search above and press return to search.

'రానా నాయుడు'పై విమ‌ర్శ‌ల‌ను పట్టించుకోని వెంకీ

By:  Tupaki Desk   |   31 May 2023 9:32 AM GMT
రానా నాయుడుపై విమ‌ర్శ‌ల‌ను పట్టించుకోని వెంకీ
X
త‌న‌కు ఉన్న ఇమేజ్ కి భిన్నంగా ఏదైనా చేయాల‌ని కోరుకునే అరుదైన న‌టుల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు. కింగ్ నాగార్జున త‌ర‌హాలోనే ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేసేందుకు ఔటాఫ్ ది బాక్స్ సినిమాల కోసం ప్ర‌య‌త్నించేందుకు వెంకీ ఏనాడూ వెన‌కాడ‌లేదు. త‌న‌కు ఉన్న మ‌హిళాభిమానుల ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకుని కుటుంబ క‌థా చిత్రాల్లో న‌టించినా కానీ వెంకీ అడ‌పాద‌డ‌పా ప్ర‌యోగాల‌కు వెన‌కాడ‌లేదు.

అయితే ఈసారి ప్ర‌యోగం బెడిసికొట్టింది. త‌న అన్న కొడుకు రానా తో క‌లిసి న‌టించిన రానానాయుడు అన్ని విధాలా విమ‌ర్శ‌కుల నుంచి వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంది. ఇది వెంకీ స్థాయికి తగ్గ వెబ్ సిరీస్ కాద‌ని ఇలాంటి పాత్ర‌లో అతడు న‌టించాల్సింది కాద‌ని క్రిటిక్స్ విశ్లేషించారు. అయితే దీనిపై ఏనాడూ వెంకీ స్పందించింది లేదు.

ఇటీవ‌ల‌ 'అహింస' ప్రమోషనల్ ఈవెంట్ లో రానా నాయుడు పై వచ్చిన తీవ్ర విమ‌ర్శ‌ల గురించి వెంకీ ఓపెన‌య్యాడు. అభిమానుల నుండి ప‌లు ర‌కాలుగా ఫీడ్ బ్యాక్ వచ్చింద‌ని.. అయితే నెట్‌ఫ్లిక్స్ షో విష‌యంలో తాను చాలా సంతోషంగా ఉన్నాన‌ని చెప్పాడు.

మ‌నం గతం గురించి ఆలోచించకూడదు.. వ‌ర్త‌మానంలో ముందుకు సాగాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. తదుపరి సీజన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఇష్టపడే విధంగా చేయాలి. అందరినీ ఎల్లవేళలా మెప్పించలేం. కాబట్టి నెక్ట్స్ ఏం చేసినా నేను మెజారిటీ ప్రేక్షకులను మెప్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తానున కొందరు వ్యక్తులు ఈ వెబ్ సిరీస్ శైలితో ప్రభావితమవుతారు. కానీ మనం గ‌తాన్ని వ‌దిలి త‌దుప‌రి బాగా ఏం చేయగలం అన్న‌దానిపై దృష్టి పెట్టాలి'' అని వెంకీ అన్నారు.

అమెజాన్ ప్రైమ్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'మీర్జాపూర్' స‌క్సెస్ వెనుక దర్శకులు సుపర్ణ్ వర్మ - కరణ్ అన్షుమాన్ లాంటి ప్ర‌తిభావంతులు ఉన్నారు. ఆ ఇద్ద‌రూ క‌లిసి రానా నాయుడు స్క్రిప్ట్ ను రూపొందించారు. ఈ సిరీస్ లో సుర్వీన్ చావ్లా - సుచిత్రా పిళ్లై కూడా కీలక పాత్రల్లో కనిపించారు. కానీ రానా నాయుడు తీవ్ర విమ‌ర్శ‌ల పాలైంది.

అన్ని లోపాల‌ను స‌రి చేసుకుని త‌దుప‌రి ప్ర‌య‌త్నాలు సాగించాల‌ని విక్ట‌రీ వెంక‌టేష్ తాజా ఇంట‌ర్వ్యూలో నిజాయితీగా అంగీక‌రించారు. అయితే వెబ్ సిరీస్ ఒక జానర్ ఆడియెన్ కి చేరువైంద‌ని దానికి తాను సంతోషంగానే ఉన్నాన‌ని .. ఏదైనా సిరీస్ లేదా సినిమాతో అంద‌రినీ మెప్పించ‌లేమ‌ని కూడా వెంకీ స్ప‌ష్ఠంగా వివ‌ర‌ణ ఇచ్చారు.