Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ రన్ టైం అన్ని గంటలా!

By:  Tupaki Desk   |   18 May 2023 1:00 PM GMT
ఆదిపురుష్ రన్ టైం అన్ని గంటలా!
X
పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'ఆదిపురుష్'. రామాయణం నేపథ్యంతో చెడు మీద మంచి ఎలా గెలించింది అనే పాయింట్‌ తో రాబోతున్న ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు. ఇది ప్రభాస్‌ కు మొట్టమొదటి హిందీ చిత్రం కావడంతో దీని పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని రిచ్‌ గా తీశారు.

ప్రభాస్ - ఓం రౌత్ కలయికలో రాబోతున్న 'ఆదిపురుష్' మూవీని జూన్ 16వ తేదీన ఎంతో గ్రాండ్‌ గా విడుదల చేయబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల ను కూడా ఇప్పటికే స్పీడు గా జరుపుకుంటోంది. అదే సమయంలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులనూ చకచకా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దీనికి ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేశారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ తాజాగా కంప్లీట్ అయినట్లు బాలీవుడ్ వర్గాల ద్వారా తెలిసింది.

అంతేకాదు, ఈ సినిమాకు ఏకంగా 174 నిమిషాలు (రెండు గంటల యాభై నాలుగు నిమిషాలు) నిడివిని ఫైనల్ చేశారట. అంటే.. దాదాపు ఈ మూవీ మూడు గంటల పాటు రన్‌ టైంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న మాట.

ఐదు భాషల్లో విడుదల కాబోతున్న 'ఆదిపురుష్' గురించి అందుతోన్న మరింత సమాచారం ప్రకారం.. వాస్తవానికి ఈ చిత్రం నిడివి మూడు గంటల కు పైగానే వచ్చిందట. కానీ, అంత సేపు ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టినట్లు అవుతుందని భావించిన చిత్ర యూనిట్.. చాలా భాగాన్ని కత్తిరించేసినట్లు తెలిసింది. ఇలా చివరికి మూడు గంటల లోపే దీన్ని ఫైనల్ చేశారట.

ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' మూవీ నుంచి వరుసగా సర్‌ప్రైజ్‌ లు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా కు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ ను విడుదల చేయగా.. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలోనే మే 20వ తేదీన ఈ చిత్రానికి సంబంధించిన 'జై శ్రీరామ్' అంటూ సాగే మొదటి సాంగ్‌ ను రిలీజ్ చేయబోతున్నారు. దీనికి తాజాగా ప్రకటన వెలువడింది.