Begin typing your search above and press return to search.

Bro.. ఆ సీన్ లో త్రివిక్రమ్ మాయ

By:  Tupaki Desk   |   12 July 2023 8:30 PM IST
Bro.. ఆ సీన్ లో త్రివిక్రమ్ మాయ
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ గురించి ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు దాదాపుగా మంచి హిట్​ను అందుకుంటాయి. ఆయన సినిమాలను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. ఆయన చిత్రంలో డైలాగ్స్​ ఏ రేంజ్​లో పేలుతాయో అందరికీ తెలిసిందే. మాటల మాంత్రికుడి పెన్​కు అంత పవర్ ఉంటుందని అభిమానులు ఆశిస్తారు. ఇకపోతే మరో విషయమేమిటంటే.. ఆయన తెరకెక్కించే, పనిచేసే సినిమాల క్లైమాక్స్​కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఎంతో అద్భుతంగా, భావోద్వేగాలతో చిత్రీకరిస్తుంటారు. సినిమాకు అదే స్పెషల్ అట్రాక్షన్​ హైలైట్​గా నిలుస్తుంటుంది.

అయితే ఇప్పుడాయన మహేశ్​బాబుతో 'గుంటూరు' కారం సినిమాతో పాటు పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమాకు పని చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రో చిత్రానికి మాటలను అందించారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్​ వచ్చింది.

ఈ చిత్ర క్లైమాక్స్​ను కూడా తనదైన మార్క్​ స్టైల్​లో బలమైన స్ట్రాంగ్ ఎమోషన్స్​తో త్రివిక్రమ్​ తీర్చిదిద్దారని తెలిసింది. పవన్​ ఇమేజ్​కు తగ్గట్టుగా అలాగే ప్రేక్షకుల మనసును తాకేలా స్క్రీన్​ ప్లే.. సన్నివేశాలను, సంభాషణలను రూపొందించారని సమాచారం అందింది.

ఇకపోతే ఈ సినిమాను మాతృకలో దర్శకత్వం వహించిన సముద్రఖనినే డైరెక్షన్​ చేశారు. త్రివిక్రమ్.. తనవంతుగా స్క్రీన్​ప్లే రాసి మాటలు అందించారు. తెలుగు ఆడియెన్స్​కు తగ్గట్టు కథలో మార్పులు చేశారట. అందులో భాగంగానే బలమైన భావోద్వేగాలతో కూడిన క్లైమాక్స్​ను తీశారట. ఇది సినిమాకే హైలైట్​గా నిలుస్తుందని ఇన్​సైడ్ టాక్​.

ఇంకా ఈ చిత్రంలో పవన్​ కల్యాణ్​తో పాటు మెగాహీరో సాయితేజ్​ కీలక పాత్ర పోషించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్​ ఇతర పాత్రల్లో నటించారు. బ్రహ్మానందం, రోహిని మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కనిపించనున్నారు. తమన్​ సంగీతం అందించారు.

జీ స్టూడియోస్​తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం జులై 28న తెలుగు రాష్ట్రాలో గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్​, టీజర్​ కూడా బాగా ఆకట్టుకున్నాయి. సోషల్​మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. ఇక ఈ సినిమా రైట్స్​ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం అందింది.