Begin typing your search above and press return to search.
ఈ విషయంలో త్రిషను దాటేవారే లేరు!
By: Tupaki Desk | 7 Jun 2023 8:00 AM GMTహీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. వయసు పెరుగుతుంటే వారికి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. అందుకే వారు ఫామ్ లో ఉన్నప్పుడే ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ త్రిష విషయంలో మాత్రం ఇది రివర్స్ అని చెప్పాలి. ఆమెకు వయసు పెరుగుతుంటే అందం పెరిగిపోతుంది. అందుకే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.
వయసు పెరుగుతున్న తర్వాత కూడా అవకాశాలు చేజిక్కించుకుంటున్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారు ఎక్కువగా హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు. కానీ త్రిష మాత్రం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే, హీరోల సరసన అవకాశాలు చేజిక్కించుకుంటుంది.
ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాలతో ఆకట్టుకుంది. ఆ సినిమాలో, ఆ మూవీ ప్రమోషన్స్ లో ఆమె అందానికి ఫిదా అయిపోయారు. తన లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. ఈ వయసులోనూ ఇంత అందంగా ఉంది ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, దర్శక నిర్మాతలు కూడా షాకయ్యారు. అందుకే ఆమెకు ఆఫర్లు క్యూలు కడుతున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల సరసన ఆమె అవకాశం చేజిక్కించుకుంది.
త్రిష ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్‌తో కలిసి లియో సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ విడుదలకు సిద్ధమౌతుంది. కాగా, తాజాగా మరో రెండు సినిమాలకు ఆమె సైన్ చేసిందట. స్టార్ హీరోలు అజిత్, ధనుష్ తదుపరి సినిమాల్లో హీరోయిన్ గా త్రిష మెరవనుంది.
విదా ముయార్చి సినిమాలో త్రిష, అజిత్ ప్రేమికురాలిగా నటిస్తోందని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ మొదలు కాకుండానే, ఆమెకు హీరో ధనుష్ 50వ సినిమాలో కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ఆమె వయసు నాలుగు పదులకు దగ్గరౌతున్న సమయంలో ఇలా హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంటూ త్రిష కొత్త రికార్డు క్రియేట్ చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో త్రిషను తన్నేవారు లేరు అని అభిప్రాయపడుతున్నారు.