Begin typing your search above and press return to search.

'దేవర' కోసం వచ్చిన కేజీఎఫ్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   27 May 2023 11:30 AM IST
దేవర కోసం వచ్చిన కేజీఎఫ్‌ స్టార్‌
X
ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన స్టార్‌ కాస్ట్‌ భారీగా పెరుగుతూనే ఉంది. బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా జాన్వీ కపూర్ కు తెలుగు లో మొదటి సినిమా.

ఇక బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ 'దేవర' సినిమాలో నటించడం వల్ల బాలీవుడ్‌ లో మంచి బజ్‌ క్రియేట్‌ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో మరో పాన్ ఇండియా స్టార్‌ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

కన్నడ సూపర్‌ హిట్ చిత్రం 'కేజీఎఫ్‌' లో కీలక పాత్రలో నటించిన తారక్‌ పొన్నప్ప కి పాన్ ఇండియా గుర్తింపు దక్కింది. కేజీఎఫ్ లో ఇతడు పోషించిన పాత్ర చిన్నదే అయినా కూడా గుర్తుండిపోయే పాత్ర. కనుక దేవర సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ మరియు తారక్‌ పొప్పన్న కాంబోలో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెలలో మరో కీలక షెడ్యూల్‌ లో కూడా తారక్‌ పొప్పన్న పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సైఫ్‌ అలీ ఖాన్‌ మరియు ఎన్టీఆర్‌ కాంబో సన్నివేశాల్లో కూడా తారక్‌ పొప్పన్న ఉంటాడనే సమాచారం అందుతోంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దేవర షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్‌ 'వార్‌' సీక్వెల్‌ షూట్‌ లో పాల్గొనబోతున్నాడు. వచ్చే ఏడాదిలో దేవర తో పాటు వార్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.