Begin typing your search above and press return to search.

సుమంత్ రెడ్డి.. సుమంత్ ప్రభాస్ ఎలా అయ్యాడు..?

By:  Tupaki Desk   |   25 May 2023 7:30 PM IST
సుమంత్ రెడ్డి.. సుమంత్ ప్రభాస్ ఎలా అయ్యాడు..?
X
ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అదే మేమ్ ఫేమస్. ఈ సినిమా ఇంకా విడుదల కానప్పటికీ, స్పెషల్ ప్రీమియర్స్ పడ్డాయి. రేపు మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రీమియర్స్ టాక్ కూడా బయటకు వచ్చింది . ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా అద్భుతం అంటూ కామెంట్ చేశారు.

అంతేకాదు మూవీలో హీరోగా, డైరెక్టర్ గా, రచయితగా చేసిన సుమంత్ ప్రభాస్ టాలెంట్ ని మహేష్ స్పెషల్ గా ప్రస్తావించి మరీ ప్రశంసించాడు. దీంతో మూవీపై ఆసక్తి పెరగడంతో పాటు, ఈ కుర్రాడి పై కూడా అందరి కళ్లు పడ్డాయి.

అసలు ఎవరీ సుమంత్ ప్రభాస్ అని తెలుసుకునే పనిలో పడగా, అతని అసలు పేరు సుమంత్ రెడ్డి అని తెలిసింది. మరి సుమంత్ రెడ్డి, సుమంత్ ప్రభాస్ ఎలా అయ్యాడబ్బా అనే క్యూరియాసిటీ మరింత పెరిగిపోయింది. ఈ విషయాన్ని అతనే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

తన అసలు పేరు సుమంత్ రెడ్డి అని చెప్పాడు. అయితే అతను చిన్నతనం నుంచే హీరో ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ అట. ప్రభాస్ మీద తనకున్న ప్రేమను అందరికీ తెలిసేలా చేయడం కోసమే, తన పేరు వెనక ప్రభాస్ పేరును తానే జోడించుకున్నాడట. ప్రభాస్ మీద అతనికి ఉన్న అభిమానాన్ని చాలా గొప్పగా చూపించాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ మూవీ గురించి చెబుతూ, ఈ కాలం యువతకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాడు. ముగ్గురు యువకుల కథగా ఈ సినిమా సాగుతుందని చెప్పాడు. ప్రతి పల్లెటూరులో ఫేమస్ అవ్వాలని తాపత్రయపడే కుర్రాళ్ల కథే ఈ సినిమా అని చెప్పాడు. అందుకే ఈ సినిమాకి మేం ఫేమస్ అని పేరు పెట్టామని చెప్పాడు. చాలా మంది కొత్త వాళ్లు ఈ సినిమాలో నటించారని, వాళ్లు కూడా చాలా అద్భుతంగా నటించారని చెప్పాడు.

చాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ బ్యానర్‌ సంయుక్తంగా ఈ మేమ్ ఫేమస్ సినిమాని నిర్మించాయి. ఈ మూవీ మేకర్స్ ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో రైటర్ పద్మభూషణ్ వంటి సూపర్ హిట్ తో మన ముందుకు వచ్చారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యారు.

మహేష్ బాబు కి నచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రేపు మన తుపాకీ రివ్యూ లో చెప్పుకుందాం