Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్ తో సిద్దార్థ్... ఎక్కడికో?

By:  Tupaki Desk   |   2 Jun 2023 6:39 PM GMT
ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్ తో సిద్దార్థ్... ఎక్కడికో?
X
సీనియర్ నటుడు, హీరో సిద్ధార్థ్, యంగ్ హీరోయిన్ అదితి రావ్ హైదరి లు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి లవ్ ట్రాక్ పై గట్టిగానే ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా సిద్ధార్థ్, అతిది డీప్ లవ్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి మహా సముద్రం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో వీరిద్దరి పెయిర్ బాగా క్లిక్ అయ్యింది. మూవీ హిట్ కాకున్నా, వీరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కౌట్ అయ్యిందనే పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి.

దానికి తోడు ఇద్దరూ కలిసి బయట కనిపించడం, రీల్స్ చేయడం మొదలుపెట్టడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. ఇక ఈ ఏడాది మొదట్లో వీరిద్దరూ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి కూడా కలిసి రావడంతో వీరి మీద వార్తలు మరింత ఎక్కువ ఊపందుకున్నాయి.

తాజాగా ఈ జంట ఎయిర్ పోర్టులో కనిపించడం గమనార్హం. శుక్రవారం మధ్యాహ్నం ఈ జంట ముంబయి ఎయిర్ పోర్టులో కనిపించారు. దీంతో వీరిద్దరూ కలిసి ఏదైనా వెకేషన్ కి వెళ్తున్నారా అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.

కాగా, ఎయిర్ పోర్టులో ఈ జంట మీడియా కంట పడింది. అదితి మీడియాకు సింగిల్ గా ఫోజులు ఇవ్వగా, సిద్ధార్థ్ మాత్రం అక్కడి నుంచి కామ్ గా వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన ముఖానికి మాస్క్ కూడా ధరించి ఉన్నారు.

వీరిద్దరూ ఎయిర్ పోర్టులో కనిపించిన వీడియోని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. వెకేషన్ కి వెళ్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఆ సమయంలో అదితి పోల్కా డాటెడ్ జంప్ సూట్ ధరించి స్టైలిష్ గా కనిపించారు. ఇక సిద్దఆర్థ్ గ్రే కలర్ షర్ట్, బ్లూ డెనిమ్ జీన్స్ ధరించారు.

అయితే, ఈ జంట వెకేషన్ కి కాదని, వారి కామన్ ఫ్రెండ్ శర్వానంద్ పెళ్లికి వెళ్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. శనివారం రాత్రి శర్వానంద్ పెళ్లి జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ కూడా వీరు జంటగా వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కాబట్టి, పెళ్లికి కూడా వీరు కలిసి వెళ్తున్నారనే కామెంట్స్ వినపడుతున్నాయి.

కాగా, నెటిజన్ల రియాక్షన్ మాత్రం మరోలా ఉంది. అదితికి మీడియాను ఎదుర్కొనే ధైర్యం ఉందని, ఆ ధైర్యం సిద్ధార్థ కు లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.