Begin typing your search above and press return to search.
హల్దీ వేడుక.. శర్వానంద్ సందడే సందడి!
By: Tupaki Desk | 2 Jun 2023 5:29 PM GMTటాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి కొడుకు అయ్యాడు. ఆయన పెళ్లి సందడి మొదలైపోయింది. నిజానికి ఆయన పెళ్లి జూన్ 3వ తేదీ రాత్రి 11గంటలకు జరగనుంది. అయితే, ఇప్పటికే వధూవరులతో సహా వారి బంధువులు అంతా జైపూర్ చేరుకున్నారు. జైపూర్ లోని రాయల్ ప్యాలెస్ లో వీరి వివాహం జరుగుతోంది. కాగా, ఉదయం హల్దీ వేడుక కూడా జరిగింది.
హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందులో శర్వానంద్ తెలుపు రంగు కుర్తా ధరించి ఉన్నారు. ఆయన ముఖం మొత్తం పసుపు పూసి ఉంది. ఆ తర్వాత శర్వా వంతు వచ్చింది.
ఆయన తన బంధువులు, కజిన్స్ అందరికీ పసుపు రాసి హడావిడి చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరినీ స్విమ్మింగ్ పూల్ లో తేసేశాడు. ఆ తర్వాత ఆయన్ని కూడా స్విమ్మింగ్ పూల్ లో ఆయన కజిన్స్ తోయడం విశేషం. వీడియో శర్వా చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు.
ఈ వీడియో ఇప్పుడు ఆయన అభిమానులను ఆకట్టుకుంటోంది. కామెంట్ల రూపంలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
హల్దీ పూర్తైన వెంటనే మెహందీ, ఆ తర్వాత రాత్రికి సంగీత్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి వివాహం రెండు రోజులపాటు జరగనుంది. వీరి పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. కొద్ది రోజుల క్రిందట శర్వా తన పెళ్లి పత్రికలను ముఖ్యమైన వారికి స్వయంగా ఆయనే పంచిపెట్టడం విశేషం.
కాగా, ఈ ఏడాది జనవరిలో శర్వానంద్ నిశ్చితార్థం రక్షిత రెడ్డితో జరిగింది. చాలా గ్రాండ్ గా ఈ కార్యక్రమం నిర్వహించగా, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. రామ్ చరణ్, అదితి రావ్ హైదరీ, అఖిల్ అక్కినేని, సిద్ధార్థ్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.
శర్వానంద్ ది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని సమాచారం. రక్షిత రెడ్డి అమెరికాకు చెందిన టెక్కీ. ఆమెది ఏపీలో ప్రముఖ పొలిటికల్ ఫ్యామిలీ. వధువు తండ్రి మధుసూధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాది కాగా.. తాత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి పొలిటిషియన్ కావడం విశేషం.