Begin typing your search above and press return to search.
రాధే శ్యామ్ డైరెక్టర్.. మళ్లీ స్టార్‌తోనే!
By: Tupaki Desk | 6 Jun 2023 5:00 PM GMTసినీ ఇండస్ట్రీలో ఫ్లాప్ తో నిలదొక్కుకోవడం అంత సాధారణమైన విషయం కాదు. ముఖ్యంగా దర్శకుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. డైరెక్టర్‌కు ఒక్క ఫ్లాప్ పడిందంటే చాలు.. అతడితో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్క హీరో ఆలోచిస్తాడు. ఇలా చాలా మంది దర్శకులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటారు. అలాంటి వారిలో రాధాకృష్ణ కుమార్ ఒకరు. మొదటి చిత్రం ఫ్లాపైనా ప్రభాస్ అతడికి 'రాధే శ్యామ్' ఆఫర్ ఇచ్చాడు. కానీ, ఇది కూడా డిజాస్టర్ అయింది.
'రాధే శ్యామ్' భారీ నష్టాలను ఎదుర్కోవడంతో డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అతడు మరో ప్రాజెక్టును ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఫలితంగా ఈ యంగ్ డైరెక్టర్ కెరీర్ ఇక ముగిసినట్లే అని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రాధాకృష్ణ ఓ హీరోకు కథ చెప్పి ఒప్పించాడని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో కథా పరమైన చర్చలు జరిపాడట. అతడు చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో సదరు తమిళ హీరో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ ఇప్పటి వరకూ టచ్ చేయని సరికొత్త జోనర్‌లో తెరకెక్కించబోతున్నాడని కూడా ఓ న్యూస్ లీకైంది.
టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ - కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతుందని తెలిసింది. ఇందుకోసం సదరు సంస్థ భారీ బడ్జెట్‌ను కూడా ప్లాన్ చేసిందని అంటున్నారు. ఇక, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని సమాచారం.
విశాల్ హీరోగా రాధాకృష్ణ కుమార్ రూపొందించే ఈ సినిమా యూనివర్శల్ కాన్సెప్టుతో రాబోతుందట. అందుకే దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తారని తెలిసింది. ఫలితంగా క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయని చెప్పొచ్చు. మరి విశాల్‌తోనైనా రాధాకృష్ణ మొదటి హిట్‌ను ఖాతాలో వేసుకుంటాడా? లేదా? అన్నది చూడాలి.