Begin typing your search above and press return to search.
ఎక్సబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థను నాశనం చేసేలా కొత్త విధానం కనిపిస్తుంది!
By: Tupaki Desk | 1 Jun 2023 4:29 PM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా రిలీజ్ రోజునే ఫైబర్ నెట్ లో కొత్త సినిమాలు ప్రదర్శించడంపై నిర్మాత నట్టి కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రారంభోత్సవం శుక్రవారం వైజాగ్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మెన్ గౌతమ్ రెడ్డి చేసిన ప్రకటనతో టాలీవుడ్ ఖంగుతింది. థియేటర్లో రిలీజ్ రోజునే ఫైబర్ నెట్ లో సినిమా ఏంటని? అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా ఈ అంశంపై నట్టికుమార్ స్పందించారు.
'దేశంలో ఎక్కడా లేని విధంగా సినిమా విడుదలను ఏపీ ప్రభుత్వం తీసుకొస్తామంటుంది. సీఎం జగన్మోహ న్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక నిర్మాతగా.. ఎగ్జిబిటర్ గా.. డిస్ట్రిబ్యూటర్.. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా వ్యతిరేకిస్తున్నాను.
పరిశ్రమని..నిర్మాతల మండలిని.. ఫిలిం ఛాంబర్ ని సంప్రదించుకుండా..జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు. 2013 లో ఎయిర్ టెల్ డీటీహెచ్ ద్వారా సినిమా విడుదల రోజునే సినిమాలను ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు.
సినిమాని అమ్మే నిర్మాత ముందుకు రాకపోతే ఇది ఎలా సాధ్యపడుతుంది? ఎగ్జిబిటర్స్.. డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థను నాశనం చేసే విధంగా ఈ విధానం కనిపిస్తుంది. ఎగ్జిబిటర్స్.. డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే కాకుండా అత్యధికభాగం నిర్మాతలు దీనికి వ్యతిరేకంగానే ఉన్నారు. అయినా ఏపీ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి గారు సినీరంగానికి చెందిన వ్యక్తి. అయనా కూడా ఎలాంటి సమావే శాలు ఏర్పాటు చేయకుండా ఇలాంటి నిర్ణయాన్ని ఆచరణలోకి తీసుకురావడం సహేతుకం గా లేదు.
ఇప్పటికే ఎగ్జిబిషన్ వ్యవస్థ దెబ్బతినిపోయింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఎగ్జిబిషన్ వ్యవస్థ మరింతగా కోలుకోలేని విధంగా తయారవుతుంది. వైజాగ్ లో ప్రారంభం కాబోయే ఫైబర్ నెట్ సినిమాల ఆవిష్కరణ సభకు నిర్మాతలను కానీ.. పరిశ్రమకు చెందిన ఇతరులకు తెలియకుండా.. పిలుపు లేకుండానే జరపబోతున్నారు.
మంత్రులు గోపాలకృష్ణ- గుడివాడ అమర్నాథ్- ఎఫ్.డి.సి చైర్మన్ పోసాని- ఇంకా సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొనబో తున్నట్లు తెలిసింది. పరిశ్రమ వ్యక్తులు లేకుండా ఈ ప్రారంభోత్సవం విడ్డూరంగా ఉంది. సీఎంగారు ఈ నిర్ణయంపై ఓసారి పునరాలోచించాలని కోరుతున్నా' అని అన్నారు.