Begin typing your search above and press return to search.

పూజాహెగ్డే - శ్రీలీల కాంబో మళ్లీ రిపీట్‌

By:  Tupaki Desk   |   8 Jun 2023 10:05 AM GMT
పూజాహెగ్డే - శ్రీలీల కాంబో మళ్లీ రిపీట్‌
X
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'గుంటూరు కారం' సినిమాలో హీరోయిన్ లుగా పూజా హెగ్డే మరియు శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే. శ్రీలీల సెకండ్‌ హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆమె సెకండ్‌ హీరోయిన్ కాదని... పూజా హెగ్డే కు సమానమైన పాత్ర ఆమెకు ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు.

సాధారణంగా త్రివిక్రమ్‌ సినిమాల్లో సెకండ్‌ హీరోయిన్‌ కు ప్రాముఖ్యత ఉండదు కానీ గుంటూరు కారం సినిమాలో మాత్రం శ్రీ లీలకు ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు. పూజా హెగ్డే మరియు శ్రీ లీల కాంబోలో సన్నివేశాలు ఉంటాయా.. అసలు వీరిద్దరి మధ్య సినిమాలో ఉండే రిలేషన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

గుంటూరు కారం విడుదలకు ముందే పూజా హెగ్డే మరియు శ్రీ లీల మరో సినిమాలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు.

తమిళ సూపర్ హిట్ మూవీ కి ఉస్తాద్‌ భగత్ సింగ్ రీమేక్‌ అనే ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు సమాన ప్రాముఖ్యత ఉంటుంది. ఒక హీరోయిన్ చనిపోతుంది. అయితే ఉస్తాద్‌ భగత్ సింగ్ లో నటించనున్న పూజా హెగ్డే మరియు శ్రీ లీల పాత్రల్లో ఎవరు చనిపోతారు అనేది సినిమా విడుదల అయ్యేంత వరకు సస్పెన్స్‌.

పూజా హెగ్డే మరియు శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్ అనడంలో సందేహం లేదు. అలాంటి హీరోయిన్స్‌ ప్రస్తుతం రెండు సినిమాల్లో కలిసి నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీలీల ప్రస్తుతం నాలుగు అయిదు సినిమాల్లో నటిస్తోంది. ఈమె జోరు పవన్ సినిమా తో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.