Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ 30 పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్?
By: Tupaki Desk | 8 Jun 2023 12:00 PMబాహుబలి ముందు బాహుబలి తర్వాత... RRR ముందు RRR తర్వాత టాలీవుడ్ హిస్టరీలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మనకు ఇప్పుడు అరడజను మంది పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు. వీరంతా పాన్ వరల్డ్ స్టార్లుగా ఎదిగేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని సద్వినియోగం చేసుకునేందుకు వ్యూహాత్మక ప్రణాళికలను కలిగి ఉన్నారు. ఒకరితో ఒకరు పోటీపడుతూ ఒకరిని మించి ఒకరు భారీ పాన్ ఇండియా/ పాన్ వరల్డ్ సినిమాలను ప్లాన్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇది ఆరోగ్యకరమైన పోటీగా అందరినీ ఆకర్షిస్తోంది.
ప్రభాస్ - రామ్ చరణ్- అల్లు అర్జున్- ఎన్టీఆర్- మహేష్ .. వీరంతా పాన్ ఇండియా స్టార్లుగా ఏలేందుకు ఎవరికి వారు సరికొత్త ప్రణాళికలతో దూసుకుపోతున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగింది. అతడికి పాన్ వరల్డ్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.
కొమురం భీమ్ పాత్రతో అతడు అంతర్జాతీయ ఆడియెన్ లో ఎమోషన్ ని రగిల్చడంలో పెద్ద సక్సెసయ్యాడు. ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్- గోల్డెన్ గ్లోబ్ దక్కడంతో చిత్రబృందానికి అసాధారణ గుర్తింపు దక్కింది. తారక్ స్టార్ డమ్ ఇమేజ్ ఇప్పుడు పదింతలు పెరిగాయి. దానికి తగ్గట్టే అతడు నటిస్తున్న తదుపరి ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా (వరల్డ్) స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
కొరటాల శివతో ఎన్టీఆర్ 30 రెగ్యులర్ చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పై ఇప్పటికే రెండు షెడ్యూల్ లను చిత్రీకరించారు. ప్రస్తుతం సెట్స్‌పై పలు పరిశ్రమలకు చెందిన నటీనటులు ఉన్నారని సమాచారం. ఆదిపురుష్ 3డిలో రావణ్ గా అలరించనున్న సైఫ్ అలీఖాన్ ఇప్పుడు ఎన్టీఆర్ 30లో భీకరమైన విలన్ పాత్రను పోషిస్తుండడం ఉత్కంఠను పెంచుతోంది.
సైఫ్ పై ఇటీవల తన పోర్షన్ ను చిత్రీకరిస్తున్నారు. షైన్ టామ్ చాకో (దసరా విలన్) .. తమిళ నటుడు కలైయరసన్ కూడా సెట్స్ పై ఉన్నారని తెలిసింది. పొరుగు భాషా నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ ఒకట్రెండు రోజుల్లో సెట్స్ లోకి జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ముఖ్యమైన షెడ్యూల్ ప్రారంభం కానుంది.