Begin typing your search above and press return to search.

జాతి మొత్తాన్ని గుండెల్లో నింపుకొని రెడ్ కార్పెట్ మీదకు.. NTR

By:  Tupaki Desk   |   10 March 2023 3:54 PM
జాతి మొత్తాన్ని గుండెల్లో నింపుకొని రెడ్ కార్పెట్ మీదకు.. NTR
X
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన సినిమా ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం) అనే పేరుకి షార్ట్‌కట్‌గా ఆర్ఆర్ఆర్ అని సంబోధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ఆర్ఆర్ఆర్ అనే పేరుతోనే మంచి పాపులారిటీ దొరికేసింది. ఈ సినిమా రిలీజ్ పెద్ద ఎత్తున చేస్తామని ముందే ప్రకటించిన మేకర్స్ అందుకు అనుగుణంగానే ఐదు భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో సైతం రిలీజ్ చేశారు.

ఇక అదే విధంగా ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్‌ లో డిజిటల్ రిలీజ్ చేసిన సమయంలో ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ చేయడంతో సినిమాకి మంచి పాజిటివ్ బజ్ అయితే దొరికింది. ముఖ్యంగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సహ గోల్డెన్ గ్లోబ్ సంస్థ కూడా సినిమాకి మంచి మంచి అవార్డులు ప్రకటించి మంచి బూస్ట్ ఇచ్చేలా చేసింది.

ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన నాటు నాటు సాంగ్ ఆస్కార్స్ కి నామినేట్ అయిన నేపథ్యంలో సినిమా యూనిట్ అంతా ఇప్పటికే అమెరికా చేరుకుంది.

రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ వంటి వారు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ సంగతంతా పక్కన పెడితే లేటుగా వెళ్లిన లేటెస్ట్‌ గా వెళ్ళినట్టుగా చెబుతున్న ఎన్టీఆర్ మాత్రం అమెరికాలోని పలు మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ సినిమా మీద మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇప్పటికే అమెరికాలో ఆర్ఆ‌ర్ఆర్ సినిమాని రీ రిలీజ్ చేస్తుండటంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ సహా సినిమా యూనిట్ కూడా పలు సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తుంది. అలా కేటీఎల్ఏ అనే ఒక సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ మా జాతి మొత్తాన్ని మా గుండెల్లో మోసుకుని రెడ్ కార్పెట్ మీద నడవబోతున్నామంటూ ఆయన కామెంట్ చేశాడు.

అంతకుముందు కూడా ఆయన ఇదేవిధంగా మరో అమెరికన్ మీడియా సంస్థతో మాట్లాడుతూ తాము ఒక ఆర్ఆర్ఆర్ యాక్టర్ గానో తెలుగు నటుడిగాను ఇండియన్ నటుడుగా రావడం లేదని ఒక ఇండియన్ గా అక్కడికి రెడ్ కార్పెట్ మీద వస్తున్నామని కామెంట్లు చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.