Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్ : ప్ర‌కృతిలో ప్ర‌తీ విప‌త్తుకీ ఓ విరుగుడు

By:  Tupaki Desk   |   27 Feb 2023 7:25 PM IST
ట్రైల‌ర్ టాక్ : ప్ర‌కృతిలో ప్ర‌తీ విప‌త్తుకీ ఓ విరుగుడు
X
మ‌నీ, వ‌న్ బై టు, మ‌నీ మ‌నీ, సిసీంద్రీ, ప‌ట్టుకోండి చూద్దాం వంటి హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ ల‌ని అందించిన ద‌ర్శ‌కుడు శివ నాగేశ్వ‌ర‌రావు. కామెడీ థ్రిల్ల‌ర్ ల ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయ‌న దాదాపు ఏడేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టారు. శివ నాగేశ్వ‌ర‌రావు తెర‌కెక్కిస్తున్న లేటెస్ట్‌ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ 'దోచేవారెవ‌రురా'. ప్ర‌ణ‌వ చంద్ర‌, మాళ‌వికా స‌తీషన్‌, అజ‌య్ ఘోష్‌, బిత్త‌రి స‌త్తి త‌దిత‌ర‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

కామెడీ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ మార్చి 11న విడుద‌ల కాబోతోంది. బొడ్డు కోటేశ్వ‌ర‌రావు నిర్మించిన ఈ సినిమా ప్ర‌చార చిత్రాలు ఇప్ప‌టికే విడుద‌లై మంచి ఆద‌ర‌ణ పొందాయి. సినిమాపై హాస్య ప్రియుల్లో అంచ‌నాల్ని పెంచాయి. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైల‌ర్ ని స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ చేత విడుద‌ల చేయించింది. కోట శ్రీ‌నివాస‌రావు, త‌నికెళ్ల భ‌ర‌ణి, బెన‌ర్జీ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

'పీకె స‌త్తి.. ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్..ఫ్రీ లాన్స‌ర్ విత్ సైలెన్స్.. అంటూ బిత్తిరి స‌త్తి డైలాగ్స్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. 'పెళ్లాల‌ని చంప‌వా' అంటూ అజ‌య్ ఘోష్ అడిగితే.. 'పైస‌లిస్తే నీ పెండ్ల‌మేంది.. నా పెండ్లాన్ని కూడా ఏసేస్తా..ప్ర‌కృతిలో ప్ర‌తీ విప‌త్తుకీ ఓ విరుగుడు వుంటుంది. అంటూ బిత్త‌రి స‌త్తి.. అజ‌య్ ఘోష్ ల సంభాష‌ణ ఆక‌ట్టుకుంటోంది.

ఇంత‌లో ఐక్యూ సోల్యూష‌న్స్ మేనేజ‌ర్ రాహుల్ ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల మ‌ర్ద‌ర్ చేస్తారు. ఇంత‌కీ అత‌న్ని మ‌ర్డ‌ర్ చేసింది ఎవ‌రు? ..దీని వెన‌క ఎవ‌రున్నారు? .. ఇంత‌కీ ముసుగు మ‌నిషి ఎవ‌రు.. ఎందుకు బెదిరిస్తున్నాడు? మంచి దొంగ‌లం అంటూ చెప్పుకుని తిరుగుతున్న వారికి రాహుల్ మ‌ర్డ‌ర్ కున్న లింకేంటీ? అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ‌.

ఎంట‌ర్ టైన్ మెంట్ నేప‌థ్యంలో సాగే థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీని ద‌ర్శ‌కుడు శివ నాగేశ్వ‌ర‌రావు తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది. గ‌తంలో తెలియ‌కుండానే కొంత మంది కార‌ణంగా దోపిడికి గుర‌య్యే వాళ్లం కానీ ఇప్ప‌డు మ‌న‌ల్ని దోచుకునే వారిని మ‌న‌మే ఎంచుకుంటూ అడ్డంగా బుక్కైపోతున్నామ‌ని ఎంట‌ర్ టైనింగ్ వేలో చెబుతున్న సినిమా ఇది. అలా అని సిస్ట‌మ్ పై ఎలాంటి సెటైర్స్ వేయ‌కుండా ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్ టైన్ చేస్తూ శివ నాగేశ్వ‌ర‌రావు గ‌త చిత్రాల పంథాలో సాగుతుంద‌ని తెలుస్తోంది.

ప్ర‌ణ‌వ చంద్ర‌, మాళ‌వికా స‌తీషన్‌, అజ‌య్ ఘోష్‌, బిత్త‌రి స‌త్తి త‌దిత‌ర‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీకి ఛాయాగ్ర‌హ‌ణం గ‌ణేష్ ఆర్లీ, సంగీతం రోహిత్ వ‌ర్ధ‌న్, కార్తీక్‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని మార్చి 11న విడుద‌ల చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.