Begin typing your search above and press return to search.
ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ఫస్ట్ ఛాయస్ అతను కాదంట
By: Tupaki Desk | 7 Jun 2023 4:32 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ లోకి హీరోగా అడుగుపెట్టారు. తరువాత రాఘవేంద్ర సినిమాలో నటించాడు. ఈ రెండు సినిమాలు బాగున్నాయనే టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా భారీ సక్సెస్ అందుకోలేదు. అదే సమయంలో ప్రభాస్ మూడో సినిమాగా వచ్చిన వర్షం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంఎస్ రాజు నిర్మించారు.
ప్రేమకథ చిత్రాలలో వర్షం మూవీ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది. ఇక ప్రభాస్ కి కూడా ఆ మూవీ స్టార్ హీరో ఇమేజ్ ని తీసుకొచ్చింది. ఈ సినిమాలో త్రిష, ప్రభాస్ ఆన్ స్క్రీన్ రొమాన్స్, సాంగ్స్ సినిమా హిట్ లో కీలక భూమిక పోషించాయి. అలాగే గోపీచంద్ విలనిజం కూడా హైలైట్ అని చెప్పాలి. వర్షం సినిమా చూసినపుడు విలన్ గా ఆ పాత్రలో గోపీచంద్ ని మాత్రమే ఊహించుకోగలం.
ఇప్పటికి వర్షం సినిమా చూస్తే ఫ్రెష్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. రీసెంట్ గా రీరిలీజ్ చేసిన మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ ని దర్శకుడు శోభన్ ముందుగా హీరో అనుకోలేదంట. సూపర్ స్టార్ మహేష్ బాబుని దృష్టిలో ఉంచుకొని కథని రాశాడంట. కచ్చితంగా మహేష్ తోనే మూవీ చేయాలని ఆయ డేట్స్ కూడా తీసుకొని కథ చెప్పాడంట.
అయితే కథ విన్న తర్వాత మహేష్ బాబు వర్షం స్టొరీ తనకి సెట్ కాదని తిరస్కరించారంట. అలా మహేష్ బాబు వదులుకుంటే తరువాత ఈ ప్రాజెక్ట్ లోకి ప్రభాస్ వచ్చాడు. సూపర్ స్టార్ నో చెప్పడంతో శోభన్ ప్రభాస్ కి స్టొరీ చెప్పడం, అతనికి నచ్చేయడం మూవీ స్టార్ట్ కావడం చకచకా జరిగిపోయాయి. తరువాత సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
అయితే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీలో హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా సుదీర్ బాబు విల న్ గా తెరకెక్కించారు. అయితే బాలీవుడ్ లో ఈ మూవీకి పెద్ద ఆదరణ రాలేదు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు వర్షం సినిమాలో చేసి ఉంటే ఆయన ఖాతాలో కచ్చితంగా ఓ బ్లాక్ హిట్ పడేది అనే మాట వినిపిస్తోంది.