Begin typing your search above and press return to search.

55 ఏళ్ల వ‌య‌సులో ఆ క‌వ్వింపు ఏంటి అమ్మ‌డు?

By:  Tupaki Desk   |   11 Jun 2023 6:30 PM IST
55 ఏళ్ల వ‌య‌సులో ఆ క‌వ్వింపు ఏంటి అమ్మ‌డు?
X
`పెళ్లి సంద‌డి` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యూపీ బ్యూటీ దీప్తీ భ‌ట్నాగ‌ర్ సుప‌రిచిత‌మే. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ప‌రిచ‌యం చేసిన హీరోయిన్ల‌లో దీప్తి ఒక‌రు. తొలి సినిమాతో భారీ విజ‌యం అందుకుని టాలీవుడ్ లో ఫేమ‌స్ అయ్యారు. ఆ త‌ర్వాత కోలీవుడ్..బాలీవుడ్ లోనూ బిజీ నాయిక‌గా కొన‌సాగారు. `ఆటో డ్రైవ‌ర్`..`సుల్తాన్`.. మా అన్న‌య్య..కొండ‌వీటి సింహాస‌నం లాంటి చిత్రాల్లో న‌టించారు.

అయితే చివ‌రిగా మాలీవుడ్ సినిమా `రాకిలి ప‌ట్టు` దీప్తి క‌నుమ‌రుగ‌య్యారు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ర‌ణ‌దీప్ ఆర్య‌ని పెళ్లి చేసుకుని కుటుంబ జీవితాన్ని అంకిత‌మ‌య్యారు. ఇప్పుడామెకు ఇద్ద‌రు కుమారులు గ‌ల‌రు. అయితే న‌టిగా కొన‌సాగుతోన్న‌ స‌మ‌యంలోనే భ‌ట్నాగ‌ర్ ప్ర‌యివేటు లిమిటెడ్ సంస్థ‌ని స్థాపించి ప‌లు టీవీ షోలు నిర్మించారు. ప్ర‌స్తుతం ఆ సంస్థ యాక్టివ్ గానూ కొన‌సాగుతుంది. ఆ మ‌ధ్య రెండ‌వ `పెళ్లి సంద‌డి` సినిమాతో మ‌ళ్లీ కంబ్యాక్ అయ్యారు.

కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ బిజీ న‌టిగా మార‌లేక‌పోయారు. వ‌య‌సు కూడా 55 కిరీచ్ అవ్వ‌డంతో దీప్తి కి అవ‌కాశాలు రాలేదు. తాజాగా ఆమె ఓ హాట్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు. అందులో ఆమె స్విమ్మింగ్ పూల్ వ‌ద్ద కెమ‌రాకి ఫోజులిచ్చారు. క‌ళ్ల‌కు న‌ల్ల‌టి అద్దాలు.. నాజుకైన సొగ‌బుల‌తో దీప్తి న‌వ నాయిక‌లా మెరిసిపోతుంది. 55 ఏళ్లు మీద ప‌డినా హాట్ భామ‌కి ఏమాత్రం తీసిపోలేదు. దీప్తి అందంగా ముస్తాబైతే ఎలా ఉంటుందో? మ‌రోసారి చూపించారు.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు దీప్తిని ఇలా చూసి స్ట‌న్ అయిపోతున్నారు. `పెళ్లి సంద‌డి` బ్యూటీ ఈ వ‌య‌సులో కూడా హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోకుండా? ఉందే అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. సీనియ‌ర్ బ్యూటీ ట‌బులా ఈ వ‌య‌సులో కూడా దీప్తీ మెర్పార్మెన్స్ చేయ‌డానికి స్కోప్ ఉంది! ఎందుకు సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేయ‌లేదంటూ చ‌ర్చించుకుంటున్నారు. లుక్ ప‌రంగా కాస్త చ‌బ్బీగాను మారినట్లు క‌నిపిస్తుంది.