Begin typing your search above and press return to search.

ఓం రౌత్ చేసిన తప్పు ఇదే..!

By:  Tupaki Desk   |   8 Jun 2023 1:00 PM GMT
ఓం రౌత్ చేసిన తప్పు ఇదే..!
X
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన పౌరాణిక చిత్రం `ఆదిపురుష్‌`. ఈ మూవీ అనౌన్స్ మెంట్ ఇచ్చినప్పటి నుంచి ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. మూవీ టీజర్ విడుదల చేసినప్పుడు కార్టూన్ మూవీ అని కామెంట్ చేశారు. దీంతో, విజువల్స్ , గ్రాఫిక్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. వీటి కారణంగానే మూవీ విడుదల చాలా ఆలస్యమైంది. కానీ ట్రైలర్ తర్వాత కాస్త విమర్శలు తగ్గాయి. కానీ, మరోసారి ఈ మూవీ పై వివాదం మొదలైంది.

మూవీ ట్రైలర్ చూసిన తర్వాత డైరెక్టర్ ఓం రౌత్ ఓ పెద్ద తప్పు చేశారు అని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ ఆ పొరపాటు ఏంటో తెలుసా? లంకలో ఉన్న సీత కోసం హనుమంతుడు వెతకడం మొదలుపెడతాడు. ఆ సమయంలో సీత జాడ కనిపెట్టిన తర్వాత, ఆమెకు ఇవ్వమని రాముడు ఉండగరం ఇస్తాడు. ఆ ఉంగరాన్ని హనుమంతుడు సీతకు ఇస్తే, ఆమె తన చూడా మణిని హనుమంతుడికి ఇచ్చి, దానిని రాముడికి ఇవ్వమని చెబుతుంది. మనకు తెలిసిన రామాయణంలో ఇప్పటి వరకు ఇదే చూశాం.

అయితే, ఓం రౌత్ మాత్రం ఆదిపురుష్ లో భిన్నంగా చూపించాడు. చూడమణికి బదులు సీత తన కంకణాన్ని హనుమంతుడికి ఇచ్చినట్లు చూపించారు. ట్రైలర్ లో ఇది స్పష్టంగా కనపడింది. దీంతో డైరెక్టర్ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటిది తాము ఏ రామాయణంలో వినలేదు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా ఆధారాలు లేకుండా ఎలా కథను మారుస్తారు అంటూ విమర్శిస్తున్నారు. డైరెక్టర్ ఇలాంటి పొరపాటు చేయడం వల్ల అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ట్రైలర్ లోనే ఇలా తప్పు దొరికింది అంటే, మూవీలో ఇంకెన్ని తప్పులు ఉంటాయో అని కంగారుపడుతున్నారు. కానీ, అవి తెలియాలంటే మూవీ రిలీజ్ అయితే కానీ తెలీదు.

ఇదిలా ఉండగా, ఈ మూవీని మొదట కేవలం ఐదు భాషల్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, తర్వాత పది భాషల్లోకి మార్చారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తుండగా, రావణ బ్రహ్మగా సైఫ్ అలీఖాన్ నటిస్తుండటం విశేషం.

లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణ్‌గా కనిపించనున్నారు. ఈ మూవీ జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.