Begin typing your search above and press return to search.
కృతిసనన్-ఓ రౌంత్ ముద్దుపై చిలుకూరు బాలాజీ అర్చకులు ఆగ్రహం!
By: Tupaki Desk | 8 Jun 2023 12:42 PMతిరుపతి లో జరిగిన 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సినిమాకి సంబంధించి తప్పుడు పోస్టర్లు వేయడంతో కాక మొదలైంది. అటుపై థియేటర్లో! హనుమంతుడికి ఒక్క సీట్ అంటూ మేకర్స్ నుంచి ఓ కామెంట్ రావడంతో కాక మరింత ముదిరింది. ఈ కామెంట్ పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. తాజాగా ఆ రెండు సన్నివేశాల్ని మించి మూడవ సన్నివేశం కనిపిస్తుంది. ఏకంగా తిరుపతి దేవస్థానంలో సీత పాత్ర పోషించిన కృతి సనన్ ని చిత్ర దర్శకుడు ముద్దు పెట్టుకోవడం..హగ్ చేసుకోవడం వివాదాస్పదంగా మారింది.
దానికి సంబంధించిన వీడియో..ఫోటోలు నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి. కృతి సనన్ పూజ తర్వాత వెళ్లిపోతుండగా ..ఓం రౌత్ ముద్దుతో ఆమెకు వీడ్కోలు పలికాడు. దీంతో పవిత్రమైన స్థలంలో ఆ పాడు పనులేంటని సోషల్ మీడియా వేదికగా నెగిటివిటీ మొదలైంది.
కొందరు అందులో తప్పేముందని సమర్ధించిన మెజార్టీ వర్గం ఆ ప్రాంగణంలో అలాంటి పనులేంటని మండిపడ్డారు. ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి 'ఆదిపురుష్' చిత్ర బృందం వెళ్లడం సంతోషకరం. అయితే స్వామివారి దర్శనానంతరం సీతమ్మ పాత్రను అమ్మాయిని దర్శకుడు ముద్దు పెట్టుకోవడం బాధకలిగింది. స్వామివారి శేషవస్త్రం ధరించి వారు కౌగిలించుకోవడం.. చుంబనం చాలా పెద్ద తప్పు. తిరుమల కొండకు భార్యాభర్తలు వచ్చినా ఎంతో నిష్ఠగా ఉంటారు. వికారమైన ఆలోచనలు రానివ్వరు. ఎంతో మంది భక్తులు ఉన్నచోట ఆ పనులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసారు.
దేవతల పాత్రలను పోషించిన వారు అంతే భక్తిశ్రద్ధలతో ఉండాలి. సీత పాత్రకు కృతి సనన్ సెట్ కాలేదు. భారతీయ పురాణాల ఆధారంగా సినిమాలు చేసిన ఎన్టీఆర్ - ఏఎన్ఆర్ ఎంతో భక్తిశ్రద్దలతో కనిపించారు. అన్నమయ్యగా నాగార్జున కూడా మెప్పించారు. కానీ ఈరోజుల్లో అలాంటి అంకితభావం కొరవడింద'న్నారు.
ఈ వివాదంపై ప్రభాస్ అభిమానులు డిఫెన్స్‌కు దిగారు. వారిలో ఒకరు ఇలా వ్రాశారు. 'దర్శనం కోసం స్త్రీలు - పురుషులు ఒకే క్యూ లైన్ ఉండి ఒకరినొకరు నెట్టుకుని మీద పడొచ్చు. వీవీఐపీల కోసం సాధారణ భక్తుల్ని ఎన్నిగంటలైనా లైన్ లో నుంచో బెట్టొచ్చు. ఇంత కష్టపడి స్వామి దగ్గరకు వెళ్తే కనీసం కొన్ని సెకెక్లు కూడా చూసే అవకాశం కూడా ఇవ్వరు. ఇక్కడ ఆయనకు నైతికత గురించి మాట్లాడే హక్కు అతనికి లేదంటూ కొందరు మండిపడ్డారు.