Begin typing your search above and press return to search.

IIFA లో `నాటు నాటు`.. ABCD 2 స్టార్ హార్డ్ వ‌ర్క్ చూశారా?

By:  Tupaki Desk   |   27 May 2023 8:23 PM GMT
IIFA లో `నాటు నాటు`.. ABCD 2 స్టార్ హార్డ్ వ‌ర్క్ చూశారా?
X
హృతిక్ రోష‌న్ - టైగ‌ర్ ష్రాఫ్ లాంటి ఫైనెస్ట్ డ్యాన్సింగ్ స్టార్స్ బాలీవుడ్ లో ఉన్నారు. వీళ్ల‌తో పాటు జూ.స‌ల్మాన్ గా పాపుల‌రైన వ‌రుణ్ ధావన్ డ్యాన్స్ బేస్డ్ సినిమాలతో అద‌ర‌గొట్టాడు. రెమో డి సౌజా `ఎబిసిడి 2` సినిమాతో డ్యాన్సింగ్ స్టార్ గా వ‌రుణ్ ప్ర‌తిభ‌ను చూశాం. అత‌డు ఇప్పుడు ఆస్కార్ కొల్ల‌గొట్టిన `నాటు నాటు...`కు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించాడు. చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ లా అత‌డు ప్రాక్టీస్ సెష‌న్ లో క‌ఠోరంగా శ్ర‌మిస్తున్న ఈ వీడియో అభిమానుల మ‌న‌సులు దోచింది. వ‌రుణ్ చ‌క్క‌ని క‌మిట్ మెంట్ ఉన్న యువ‌హీరో. పైగా హార్డ్ వ‌ర్క‌ర్. అయితే అత‌డు `నాటు నాటు..` ప్రాక్టీస్ చేయడం వెన‌క క‌థాక‌మామీషు ఏమై ఉంటుంది? అన్న‌ది ఆరా తీస్తే..

ప్ర‌స్తుతం దుబాయ్ లో జ‌రుగుతున్న IIFA అవార్డుల వేదిక‌పై వ‌రుణ్ ధావ‌న్ `నాటు నాటు..`కు స్టెప్పులేయ‌బోతున్నాడు. రీమిక్స్ మెడ్లీల‌తో వేదిక ఆద్యంతం ర‌క్తి క‌ట్ట‌నుంది. ఇక వ‌రుణ్ ధావ‌న్ మెరుపు డ్యాన్సుల‌కు ఐఫా వేదిక కానుంది. ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్కార్.. గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న `నాటు నాటు..` పాట‌కు బాలీవుడ్ నుంచి కావాల్సిన గౌర‌వం ద‌క్కుతోంది. ప్రాంతీయ సినిమా జాతీయ సినిమా అనే ఈగో స‌మ‌స్య అస‌లు లేనేలేదు. ఎలాంటి ఈగోల‌కు తావివ్వ‌కుండా వ‌రుణ్ లాంటి ప్ర‌తిభావంతుడైన హీరో ఈ పాట‌ను ఎంపిక చేసుకుని స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక వ‌రుణ్ ఎలాగైనా ద‌క్షిణాది మార్కెట్లో త‌న‌ని తాను నిరూపించుకోవాల‌ని క‌ల‌లుగంటున్నాడు. అందులో భాగంగా అత‌డు న‌టిస్తున్న ప్ర‌తి సినిమాని ద‌క్షిణాదినా రిలీజ్ చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. ఇటీవ‌లే భేధియా సినిమాతో అత‌డు అలాంటి ప్ర‌య‌త్న‌మే చేసాడు. భేధియా తొలి అడుగు. త‌దుప‌రి అత‌డు మ‌రిన్ని భారీ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ సినిమాల‌తో సౌత్ మీద దండ‌యాత్ర‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడ‌ని కూడా తెలుస్తోంది.

గ‌త ఏడాది వరుణ్ ధావన్ బాక్సాఫీస్ వద్ద సినిమాలు సరిగ్గా ఆడని సమయంలో `జగ్ జగ్ జీయో`తో హిట్టందుకున్నాడు. న‌టుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. భేదియాలో న‌టుడిగా మెప్పించాడు. ఈ సినిమాకి హిందీలో గొప్ప సమీక్షలు ద‌క్కాయి. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించినంత పెద్ద విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం IIFA అవార్డులకు హాజరు కావడానికి అబుదాబిలో ఉన్న వరుణ్ ధావన్ ర‌క‌ర‌కాల వేష‌ధార‌ణ‌ల‌తో యువ‌త‌రాన్ని అల‌రిస్తున్నాడు. ఒక్కోసారి బ‌నియ‌న్ షార్ట్ తో చాలా సాధారణ అవతారం లో కనిపించ‌డం స‌ర్ ప్రైజ్ చేసింది. దేశీ స్టైల్ (ఫైర్ ఎమోజీలతో) అని ఒక‌రు...ఉర్ఫీ కా భాయ్! అని మ‌రొక‌రు `చిన్న పిల్లాడి వేషం` అని వేరొక‌రు వ్యాఖ్యానించారు.

త‌దుప‌రి నితేష్ తివారీ చిత్రం `బవాల్‌`లో వ‌రుణ్ ధావ‌న్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో `దేవ‌ర`(ఎన్టీఆర్‌-కొర‌టాల‌) ఫేం జాన్వీ కపూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇది కాకుండా రస్సో బ్రదర్స్ నిర్మాణ సార‌థ్యంలో రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ పాన్-గ్లోబల్ సిరీస్ `సిటాడెల్` భారతీయ వెర్ష‌న్ లో వ‌రుణ్ ధావ‌న్ న‌టిస్తున్నాడు. ఇందులో సమంత రూత్ ప్రభు కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది.