Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్టర్స్ తో అల్లు అరవింద్ లైనప్.. మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   2 Jun 2023 3:23 PM GMT
స్టార్ డైరెక్టర్స్ తో అల్లు అరవింద్ లైనప్.. మామూలుగా లేదుగా!
X
టాలీవుడ్ సినీ పరిశ్రమలో బడా నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఆయన బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే.. అది పక్కా హిట్ సినిమాగా భావిస్తారు. ఆ బ్యానర్ నుంచి వచ్చిన అన్ని సినిమాలు హిట్ గా నిలిచాయి. అయితే ఈ రోజు నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌ పై నిర్మించనున్న పలు సినిమా ప్రాజెక్ట్‌ లను ప్రకటించారు.

అల్లు అరవింద్... 2018 మలయాళ డబ్బింగ్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో మాట్లాడుతూ... తన రాబోయే ప్రాజెక్ట్‌ల కోసం స్టార్ డైరెక్టర్లు బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి , కార్తికేయ దర్శకుడు చందూ మొండేటిలు సంతకం చేసినట్లు వెల్లడించారు. వీరితో సినిమాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ముగ్గురు దర్శకులు స్టార్ డైరెక్టర్లు కావడం గమనార్హం.

అల్లు అరవింద్ తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ... దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ గారితో మా ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు పరిశీలనలో ఉన్నారు... అని చెప్పుకొచ్చారు.

ఇక ఏజెంట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏజెంట్ దెబ్బతో కాస్త నిరాశలో ఉన్నారు. ఈసారి భారీ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారని అల్లు అరవింద్ వెల్లడించారు. గీతా ఆర్ట్స్ కోసం చందూ మొండేటి మూడు ప్రాజెక్ట్‌లకు దర్శకత్వం వహించనున్నాడు.

ఇప్పటికే రెండు స్క్రిప్ట్‌లు పూర్తయ్యాయని, అందులో ఒకటి దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుందని అరవింద్ తెలిపారు. చందు మొండేటి కార్తీకేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.

ఇక ఈ ప్రాజెక్టులతో పాటు... అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ పుష్ప ది రూల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన వేర్ ఇజ్ పుష్ప గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే పుష్ప 2 తర్వాత తదుపరి పాన్-ఇండియా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించే యోచనలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.