Begin typing your search above and press return to search.
ఆదిపురుష్ భారమంతా ప్రభాస్ భుజాలమీదే..!
By: Tupaki Desk | 8 Jun 2023 10:05 AMప్రభాస్ కథానాయకుడి గా నటించిన పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'. బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారారు ప్రభాస్. అప్పటి నుంచి ఆయన అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. అయితే, బాహుబలి తర్వాత ఆయన కు సరైన హిట్ పడలేదు. కాగా, తొలిసారి గా ఆయన ఓ పౌరాణిక చిత్రాన్ని చేశారు. అది కూడా రాముని కథ కావడం తో దేశం మొత్తం ఆసక్తిగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. టి సిరీస్ వారు అత్యంత భారీ స్థాయిలో తెరెక్కించారు.
ఈ ఆది పురుష్ సినిమా కి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. 3డీ ఫార్మాట్‌లో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ని తెలుగు రాష్ట్రాల్లో యువీ క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నఈ దృశ్యకావ్యాన్ని జూన్ 16న అత్యంత భారీ స్థాయి లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తిరుపతి లో ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందాల నే కోరిక తో వారు ఈ ఈవెంట్ అక్కడ నిర్వహించడం విశేషం. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది. మూవీ విడుదల కు ఇంకా సరిగ్గా పది రోజుల సమయం కూడా లేదు. ఇప్పటికే విడులైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ బాగా ఆకట్టుకుంటున్నాయి. కానీ, ఇంకా ఈ మూవీ ని జనాల్లో కి తీసు కు వెళ్లాలి అంటే ప్రమోషన్స్ ఇంకాస్త గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది.
నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం మూవీ డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ చాలా సింపుల్ గా తమ ప్రసంగాలు ముగించారు. ఒకవేళ భాష సమస్య కావచ్చు. వారికి తెలుగు ఇండస్ట్రీ కొత్త కాబట్టి వారు చాలా సింపుల్ గా మాట్లాడారు. ఈ వెంట్ మొత్తం ప్రభాస్ తన భుజాల పై మోయాల్సి వచ్చింది. నిజాని కి ప్రభాస్ ఎక్కువ స్పీచ్ లు ఇవ్వడు. చాలా తక్కువ మాట్లాడతాడు. అలాంటి ప్రభాస్ ఈ మూవీ కోసం ఈవెంట్ లో చాలా సేపు మాట్లాడారు.
గతంలో రాధేశ్యామ్ మూవీ సమయం లోనూ ప్రభాస్ ప్రమోషన్స్ చాలా గట్టిగానే చేశారు. కానీ, ఆ సినిమా ఫలితం అనుకూలంగా రాలేదు. కానీ ఈ మూవీ విషయం లో అలా జరగకూడదు అనుకుంటన్నారు. అందుకే, దక్షిణాదిన ఈ మూవీ ని జనాల్లో కి మరింత తీసుకువెళ్లే బాధ్యత అంతా ఇప్పుడు ప్రభాస్ పైనే ఉండటం గమనార్హం. దీంతో, ఆయన రేపటి నుంచి మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ మూవీ ని మొదట కేవలం ఐదు భాషల్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, తర్వాత పది భాషల్లో కి మార్చారు. ప్రభాస్ రాముడి గా, కృతి సనన్ సీత గా నటిస్తుండగా, రావణ బ్రహ్మ గా సైఫ్ అలీఖాన్ నటిస్తుండటం విశేషం.