Begin typing your search above and press return to search.
అప్పుడే 'ఆదిపురుష్' పై దుష్టశక్తులు!
By: Tupaki Desk | 7 Jun 2023 8:54 PMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్ర లో 'ఆదిపురుష్' భారీ అంచనాల మధ్య రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. జూన్ 16న భారీ అంచనాల మద్య రిలీజ్ అవుతుంది. ఇతిహాసం 'రామాయణం' ఆధారంగా చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓంరౌత్ తెరకెక్కి స్తున్నారు.
టీసిరీస్ ఫిల్మ్స్- రెట్రో ఫిల్మ్స్ సంయుక్తంగా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. సినిమా కోసం మూడేళ్ల పాటు చిత్ర బృందం రేయింబవళ్లు ఎంతో శ్రమించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ లో ఓ మహాయజ్ఞంలా భావించి చేసిన చిత్రమిది.
రాముడి కథని భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ఓ గొప్ప ప్రయత్నమిది. దీంతో సినిమా రిలీజ్ కోసం 142 కోట్ల జనాభా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం ఇది. జూన 16 ఎప్పుడొస్తుందా? అని మూడేళ్లగా ఎదురుచూస్తున్నారు. ఆ రాముడి కథని తెర పై చూసి తరించిపోవాలని ప్రేక్షకాభిమాను లో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రం పై అప్పుడే దుష్టశక్తులు కళ్లుపడ్డాయి. రాముడి కథ ని చూసి ఓర్వలేని కళ్లు తప్పుడు ప్రచారాల కు తెర తీసాయి.
ఆదిపురుష్ ప్రదర్శించే థియేటర్లలో దళితుల కు ప్రవేశం లేదంటూ ఓ పేక్ పోస్టర్ నెట్టింట్ వైరల్ అవుతోంది. రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడి గా థియేటర్లలో దళితుల కు ప్రవేశం లేదు అంటూ ఓ వ్యక్తి పోస్టర్ 'ఆది పురుష్' పోస్టర్ పై వేసి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసాడు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఆ రాతతోనే 'ఆదిపురుష్' పై..రామ-సీత కథ పై విషం చిమ్మాడ ని అర్ధమవుతుంది. పవిత్ర భారతదేశం లో పుట్టి ఇలాంటి తప్పుడు రాతలు రాసిన వ్యక్తిని ఏమని వర్ణించాలి. ఇది సరదా కోసమో! పబ్లిసిటీ కోసమే చేసిన పనిలా లేదు. మతం మాటున విషం చిమ్మినట్లుగా ఉందని సోషల్ మీడియా లో నెటి జనులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వారి ని సైబర్ క్రైమ్ వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.