Begin typing your search above and press return to search.

నాయ‌కుడి కొడుకుని పెళ్లాడుతున్న కుంద‌న‌పు బొమ్మ‌

By:  Tupaki Desk   |   8 Jun 2023 9:22 AM GMT
నాయ‌కుడి కొడుకుని పెళ్లాడుతున్న కుంద‌న‌పు బొమ్మ‌
X
యూత్ స్టార్ నితిన్ స‌ర‌స‌న వ‌ర‌స చిత్రాల్లో న‌టించి తెలుగు నాట అభిమానుల్ని సంపాదించుకుంది మేఘా ఆకాష్‌. ఈ బ్యూటీ త‌మిళంలోను న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మేఘా ఆకాష్ హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన రాధే సహా పలు చిత్రాల్లో నటించింది. కానీ దుర‌దృష్ట‌వ‌శ‌తాత్తూ కెరీర్ లో ఆశించిన పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా జ‌యాప‌జ‌యాల‌తో అవ‌కాశాలు అందుకుంటున్న మేటి నాయిక‌గా మేఘా పేరు వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. మను చరిత్ర, మజై పిడికథ మనితన్ - బూ అనే మూడు చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.

ఇంత‌లోనే ఆమె పెళ్లిపై ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మేఘా ఆకాష్ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ ఇప్పటికే జరుగుతున్నాయని సమాచారం. అయితే అధికారికంగా ఈ వార్త‌ల్ని ధృవీక‌రించాల్సి ఉంది.

క్రీడాకారులు పారిశ్రామిక వేత్త‌లు రాజకీయ నాయకుల పుత్ర ర‌త్నాల్ని పెళ్లాడేందుకు క‌థానాయిక‌లు వెన‌కాడ‌డం లేదు. ఇటీవ‌ల హ‌న్సిక ప్ర‌ముఖ బిజినెస్ మేన్ ని పెళ్లాడింది. రాఘవ్ చద్దా అనే ఎంపీని పరిణీతి చోప్రా వివాహం చేసుకుంది. ఇదే బాట‌లో ఇప్పుడు మేఘా ఆకాష్ కూడా ఒక నాయ‌కుడి వార‌సుడినే పెళ్లాడ‌బోతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు టాలీవుడ్ యువ‌హీరో శ‌ర్వానంద్ రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి యువ‌తి ని పెళ్లాడ‌నున్న సంగ‌తి తెలిసిందే. అత‌డి కాబోయే భార్య ర‌క్షిత రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ప‌ని చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ జంట నిశ్చితార్థం పూర్త‌యింది.