Begin typing your search above and press return to search.
డ్యాన్సింగ్ స్టార్ గా మారిన ఏ.ఆర్.రెహమాన్
By: Tupaki Desk | 28 May 2023 10:58 AMగానంతో పాటు నృత్యంతో అలరించే సంగీత దర్శకులు చాలా అరుదు. పంజాబీ పాప్ కల్చర్ లో డ్యాన్స్ ల్లో హైఎనర్జీని ప్రదర్శించేందుకు గాయకులు సంగీత దర్శకులు ప్రయత్నిస్తుంటారు. దలేర్ మెహందీ... హిమేష్ రేషమ్మియా.. అర్జిత్ సింగ్.. జెర్రీ .. సంధు ఇలా చెప్పుకోదగ్గ గాయకులే ఉన్నారు. వీరంతా పాటతో పాటు ఆట పరంగాను ఎనర్జీని ప్రదర్శిస్తుంటారు. తెలుగులో అరుదుగా దేవీశ్రీ ప్రసాద్..థమన్ లాంటి సంగీత దర్శకులు.. తమిళంలో అనిరుధ్ రవిచంద్రన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పాటతో పాటు డ్యాన్సులతోను మైమరిపిస్తుంటారు.
అయితే వీళ్లందరి కంటే ఎంతో సీనియర్ అయిన ఏ.ఆర్.రెహమాన్ ఎప్పుడూ ఒక పూర్తి పాటలో నృత్యం చేస్తూ కనిపించలేదు. కానీ ఈసారి ట్రెండ్ మార్చారు రెహమాన్. తనలోను కావాల్సినంత ఎనర్జి ఉందని నిరూపిస్తూ సరికొత్త వీడియో ఆల్బమ్ తో ముందుకు వచ్చారు. ఆస్కార్ విజేత... ప్రముఖ సంగీత స్వరకర్త AR రెహమాన్ యూనిక్ స్టైల్ ఈ పాటలో ఎలివేట్ అయింది. నిజానికి రెహమాన్ ఎప్పుడూ ప్రచారం కోసం ప్రదర్శన వీడియోలను ఇష్టపడడు. తన పని మాట్లాడాలనుకుంటారు. అనిరుధ్ - తమన్ వంటి నిర్మాతలు ప్రచార వీడియోల కోసం భారీగా ఖర్చు చేస్తుండగా ఇప్పుడు రెహమాన్ దానిని అనుసరించడం ఆశ్చర్యపరిచింది.
నిజానికి రెహమాన్ గొప్ప గాయకుడు సంగీతజ్ఞుడు.. కానీ డ్యాన్స్ చేస్తాడని ఎన్నడూ ఊహించలేదు అభిమానులు. ఈసారి 56 ఏళ్ల స్వరకర్త లిరికల్ వీడియో సాంగ్ కి కొరియోగ్రఫీ ని జోడించడం ఆశ్చర్యపరిచింది. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ నేపథ్యంలో వచ్చే పాట. స్టాలిన్ కథానాయకుడిగా నటించగా వడివేలు కీలక పాత్రను పోషించారు. మామన్నన్ అనేది టైటిల్ . ఈ చిత్రం కోసం `జిగు జిగు రైల్` ప్రమోషన్ సాంగ్ కోసం రెహమాన్ డ్యాన్స్ మూవ్స్ యూనిక్ గా అలరించాయి. ఈ పాట ఆద్యంతం రెహమాన్ బాణీ ఎంతో ఆకట్టుకుంది. గాయకుడిగాను ఎంతో ఆర్ధ్రతతో కూడుకున్న పాటను ఆలపించారు.
కొందరు పిల్లలతో కలిసి రెహమాన్ చేస్తున్న సందడి పాట అంతటా ఆకట్టుకుంది. లెజెండరీ కంపోజర్ రెహమాన్ వాయిస్ ఆయన కుమార్తె ఖతీజా వాయిస్ ఈ పాటకు చక్కగా అమరాయి. అయితే ఆ పాటలోని మెలాంకోలీ సినిమా రాజకీయ ఫ్లేవర్ కి బాగా సరిపోయే కంటెంట్ అనడంలో సందేహం లేదు.