Begin typing your search above and press return to search.

96: తెలుగు టైటిల్ లాక్ అయిందోచ్..!

By:  Tupaki Desk   |   4 March 2019 6:36 AM GMT
96: తెలుగు టైటిల్ లాక్ అయిందోచ్..!
X
తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన '96' సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ను తెలుగులో నిర్మిస్తుండగా తమిళ చిత్రాన్ని రూపొందించిన ప్రేమ్ కుమారే తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ సేతుపతి - త్రిష పాత్రల్లో శర్వానంద్ - సమంతాలు నటిస్తున్నారు. తమిళ చిత్రానికి సంగీతం అందించిన గోవింద్ వసంత తెలుగులో కూడా సంగీతం అందిస్తున్నాడు.

ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతున్న ఈ సినిమాకు తాజాగా టైటిల్ ను లాక్ చేశారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వారు రీసెంట్ గా ఫిలిం ఛాంబర్లో 'జానకీ దేవి' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. తమిళంలో సినిమా కథ జరిగే టైమ్ ఫ్రేమ్ ను టైటిల్ గా ఫిక్స్ చేస్తే.. తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి హీరోయిన్ పేరును టైటిల్ గా నిర్ణయించినట్టున్నారు.

శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ వారంలోనే '96' రీమేక్ లో శర్వానంద్ కు సంబంధించిన లుక్స్ టెస్ట్ జరిపి ఈ సినిమాకు సూట్ అయ్యే లుక్ ఫైనల్ చేస్తారట. మరో వైపు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ లో కొన్నిస్వల్ప మార్పులు కూడా చేస్తున్నారట. ఏప్రిల్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని.. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి ఆగష్టు 29 న రిలీజ్ చేయాలని దిల్ రాజుప్లాన్ చేస్తున్నారట.