Begin typing your search above and press return to search.

96 రీమేక్ - అఫీషియల్

By:  Tupaki Desk   |   26 Jan 2019 7:39 AM GMT
96 రీమేక్ - అఫీషియల్
X
తమిళ్ లో గత ఏడాది పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచిన 96 తెలుగు రీమేక్ అఫీషియల్ అయిపోయింది. ఆ సినిమా విడుదలకు ముందే హక్కులను కొన్న దిల్ రాజుకు సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు మాత్రం బాగానే టైం పట్టింది. తొలుత నాని అని అల్లు అర్జున్ అని పలు పేర్లు వినిపించినప్పటికి ఫైనల్ గా శర్వానంద్ లాక్ అయిపోయాడు. జోడిగా ఒరిజినల్ వెర్షన్ లో చేసిన త్రిషనే ఉంటుందేమో అనుకున్నారు కాని ఆ స్థానంలో సమంతా వచ్చి చేరింది. దీన్ని అనౌన్స్ చేస్తూ దిల్ రాజు పోస్టర్ విడుదల చేసారు.

ప్రొడక్షన్ నెంబర్ 34గా పేర్కొన్న దిల్ రాజు దీనికి ఇంకా పేరుని ఫిక్స్ చేయలేదు. తమిళ్ టైటిల్ 96 మీనింగ్ వేరు. ఆ సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న హీరో హీరొయిన్ల కథగా ఫ్లాష్ బ్యాక్ చాలా కీలకంగా ఉంటుంది. అయితే తెలుగులో శర్వా సమంతాల ఇమేజ్ వయసు దృష్ట్యా దాన్ని పదేళ్ళకు జరిపి 2009లో చదువుకున్నట్టు చూపిస్తారని టాక్ ఉంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ లోపు శర్వా సమంతాలు తన బాలన్స్ కమిట్మెంట్స్ పూర్తి చేసి ఇందులో జాయిన్ అవుతారు.

విడుదల దసరాకు ఉండొచ్చని వినికిడి. తమిళ్ వెర్షన్ హ్యాండిల్ చేసిన దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెలుగుకు సైతం దర్శకత్వ బాద్యతలు తీసుకున్నాడు. టెక్నికల్ టీం ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. స్కూల్ రోజుల నాటి అందమైన జ్ఞాపకాలు ప్రేమ కథ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న 96 రీమేక్ మీద అంచనాలు మొదలైపోయాయి. విజయ్ సేతుపతి చేసిన మేజిక్ శర్వానంద్ ఎలా రీ క్రియేట్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది