Begin typing your search above and press return to search.

17 ఏళ్ళ తర్వాత 96కే వచ్చింది

By:  Tupaki Desk   |   18 March 2019 6:21 AM GMT
17 ఏళ్ళ తర్వాత 96కే వచ్చింది
X
ప్రముఖ నటులు గొల్లపూడి మారుతీరావు గారి అబ్బాయి దివంగత శ్రీనివాస్ పేరు మీద ఏటా అవార్డులు ఇచ్చే సంగతి తెలిసిందే. ఉత్తమ విలువ కలిగిన చిత్రాలకు మాత్రమే ఈ పురస్కారం దక్కుతుందన్న గౌరవం దీని మీద పరిశ్రమలో ఉంది. తాజాగా తమిళ్ లో గత ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన 96 దర్శకుడు ప్రేమ్ కుమార్ కు ఈ పురస్కారం దక్కింది. అందులో విశేషం ఏముంది అనుకోకండి.

ఈ అవార్డు అధిక శాతం తెలుగు సినిమా వాళ్ళకే ఇస్తారు. ఇంతకు ముందు 2002లో కుట్టి అనే తమిళ్ మూవీకి గాను జానకి విశ్వనాథన్ కు ఇది దక్కింది. ఆ తర్వాత ఇప్పటి దాకా వేరే ఏ కోలీవుడ్ డైరెక్టర్ ఇది అందుకోలేదు ఆ రకంగా 96 మరో ప్రత్యేకతను సంతరించుకుంది. ఒకరినొకరు కనీసం తాకకుండా విజయ్ సేతుపతి-త్రిష ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. టీవీ ఛానల్ లో వచ్చినా చెన్నైలో మరో ఐదు వారాలు అదనంగా ఆడటం దీనికే చెల్లింది.

ఇప్పుడు తెలుగులో దిల్ రాజు శర్వానంద్ సమంతా జంటగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫైనల్ వెర్షన్ రెడీ కాగానే సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ లోపు శర్వా సుధీర్ వర్మ సినిమా పూర్తి చేసుకుని జాయిన్ అవుతాడు. సమంతా అందుబాటులో ఉన్నప్పటికీ షూటింగ్ మొదలుపెట్టేందుకు ఇంకొంత సమయం పట్టేలా ఉంది